2024లో ఉర్రూతలూగిస్తున్న బతుకమ్మ పాటలు.. మీరూ ఓ లుక్కేయండి

Mana Enadu : తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక “బతుకమ్మ పండుగ (Bathukamma Festival )”. తొమ్మిది రోజులపాటు సాగే ఈ ఉత్సవం ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభం అవుతుంది. ఇవాళ (అక్టోబర్ 2వ తేదీ) ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు ఉదయాన్నే తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. సాయంకాలం అంతా ఓచోట చేసి బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ, కోలాటాలాడుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఉత్సాహంగా ఈ సంబురాలు జరుపుకుంటున్నారు. 

అయితే ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ దగ్గరికి వచ్చిందంటే చాలు చాలా మ్యూజిక్ కంపెనీలు ప్రత్యేకంగా బతుకమ్మ పాటలు రిలీజ్ చేస్తుంటాయి. అలా ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి సరికొత్త బతుకమ్మ పాటలు (Bathukamma Songs 2024) ఆడపడుచులను ఆకట్టుకుంటున్నాయి. కొన్ని ఎమోషనల్ గా ఉంటే.. మరికొన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. అలా బతుకమ్మ సంబురాల్లో ఈ ఏడాది కూడా దుమ్ములేపే పాటలు వచ్చాయి. మరి ఈ ఏడాది ఆడపడుచులను అలరిస్తున్న ఆ సరికొత్త బతుకమ్మ పాటలు ఏంటో ఓ లుక్కేద్దామా.. 

హే పుట్టినాదే పువ్వులల్లో

హే పుట్టినాదే పువ్వులల్లో.. పెరిగినాదే మట్టి మనుషుల చేతులల్లో.. బతుకమ్మయ్యి.. ఓ రామ రామయ్యలో.. హే నేల దిగిన నెలవంక నెత్తి మీద పొడిచినట్టు ఎత్తుకున్న బతుకమయ్యి.. శ్రీరామ రామయ్యలో.. అంటూ సాగే ఈ పాట ఇప్పుడు తెలుగింటి ఆడపడుచులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 

ఓ శివుని గుమ్మ ఊరువాడ విలిసినాదే

పూల శిలకు పురుడు పోసెనే పులే దారిలో.. పేరు పెట్టి జోల వాడెనే నగాదారిలో.. గావురంగ తీర్చిదిద్దెనే పులే దారిలో.. ఆడబిడ్డలాగా పెంచెనే నగాదారిలో.. ఓ శివుని గుమ్మ ఊరువాడ విలిసినాదే.. ఓ పూలకొమ్మ శిప్పి నిన్ను విలిసినాదే.. పాట కూడా అలరిస్తోంది.

 

బతుకమ్మ పండుగొచ్చే

బతుకమ్మ పండుగొచ్చే ఆటలాడుకుందామా పాట పాడుకుందామా.. పాట పాడుకుందమా గౌరమ్మను వేడుకుందామా.. ఆడబిడ్డల పండగొచ్చే పల్లెను తలచుకుందామా చెల్లెలు పిలుచుకుందామా.. చెల్లెలు పిలుచుకుందామా ప్రేమలు పంచుకుందామా.

 

ఎన్నడులేనిది నిండుగా పూసినయో

ఎన్నడులేనిది నిండు పున్నమోలే నిండుగా పూసినయో.. రామా అయ్యో రామా అయ్యో నై రామా.. సింగిడార పోసినట్టు నేల మీద రంగుల రాసులమ్మో.. రామా అయ్యో రామా అయ్యో నై రామా.. ప్రకృతి అందాలు పడతి ఆనందాలు కలబోసి విరబూసే పూల పండగ

 

గుమ్మరే గుమ్మా గుమ్మా

గుమ్మరే గుమ్మా గుమ్మా గునుగు పూల జాతరా.. తంగేడు తామరలు తల్లీ నీ చుట్టూరా.. కానలో కొమ్మారెమ్మ కోరి పూలు పంపగా.. వంతపాడుతూ మురిసె వనితలు నిను ఊరూరా.

 

మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో

మల్లె తోటలో ఉన్న ఉయ్యాలో.. ఓ మామగారు ఉయ్యాలో.. ఈ పువ్వు పేరేమి ఉయ్యాలో.. చెప్పరాదు మామ ఉయ్యాలో.. ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. నాకు తెల్వబోదే ఉయ్యాలో.. ఆ పువ్వు పేరోమో ఉయ్యాలో.. మీ అత్తనడుగే ఉయ్యాలో.

Share post:

లేటెస్ట్