జమ్ముకశ్మీర్ తుది దశ పోలింగ్.. ఓటర్లకు ప్రధాని మోదీ రిక్వెస్ట్

Mana Enadu : జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections 2024) తుది విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 39.18 లక్షల మంది ఓటర్లు ఈ దశలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బరిలో 415 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్ (Congress), ముజఫర్‌ బెయిగ్‌ (Congress) ఉన్నారు.

5,060 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ నిమిత్తం దాదాపు 20 వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నారు. 370 రాజ్యాంగ అధికరణం రద్దు తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అక్టోబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు (Jammu Kashmir Results 2024) ఉంటుంది.

జమ్ముకశ్మీర్ తుది దశ పోలింగ్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఓటర్లకు కీలక సందేశం ఇచ్చారు. ప్రజలు, పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటిసారి ఓటు వేస్తున్న యువతే కాకుండా మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్​ పాల్గొంటారని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

జమ్ముకశ్మీర్‌ ఎన్నికల తొలి విడతలో 61.38 శాతం, రెండో విడతలో 57.31 శాతం పోలింగ్‌ (Jammu Kashmir Polling) నమోదైంది. మూడో విడతలోనూ వీలైనంత ఎక్కువ శాతం ఓటింగ్‌ లక్ష్యంగా కేంద్ రఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు రెండు దశల్లో 50 నియోజకవర్గాలకు నిర్వహించిన ఎన్నికల్లో 17 స్థానాల్లో పురుషులతో పోలిస్తే మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (CEO Rajeev Kumar) తెలిపారు. 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *