Mana Enadu : నందమూరి బాలకృష్ణ ఓవైపు సినిమాలతో మరోవైపు ఓటీటీలో ప్రోగ్రామ్స్‌తో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే బాబీతో ఓ సినిమా చేస్తున్న బాలయ్య.. ఇటీవలే బోయపాటితో అఖండ-2 (Akhanda) సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇక ఈ రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నా.. ఆహా ఓటీటీలో వచ్చే అన్‌స్టాపబుల్ టాక్ షో(Unstoppable With NBK)కు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మూడు సీజన్లు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
అన్‌స్టాపబుల్ సీజన్-4
పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్(Prabhas), రానా వంటి స్టార్ హీరోలు.. చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి రాజకీయ నేతలు ఈ షోలో పాల్గొన్నారు. ఈ షోతో ప్రేక్షకుల్లో బాలయ్య రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బాలయ్యను మరో కోణంలో ఈ షో ఆవిష్కరించింది. ఇటీవలే అల్లు అరవింద్ కోసమే ఈ షో కంటిన్యూ చేస్తున్నా అని బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నాలుగో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగిందట.
అన్‌స్టాపబుల్‌లో మరోసారి చంద్రబాబు
నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ మొదట అల్లు అర్జున్(Allu Arjun)తో స్టార్ అవుతుందని టాక్ నడిచింది. కానీ తాజాగా మొదటి ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) గెస్టుగా రాబోతున్నారని సమాచారం. ఆయనతో పాటు ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్, ఏపీ డిప్యూటీ సీఎం కూడా ఈ షోలో పాల్గొనబోతున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురు గత సీజన్లోనూ ఈ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈనెల 24వ తేదీ నుంచి అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్-4(Unstoppable Season 4) ప్రారంభం కాబోతోందట.
అన్‌స్టాపబుల్‌లో అల్లు అర్జున్
అయితే మొదట ఈ ఎపిసోడ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో చేయాలనుకున్నారట. కానీ గతంలో గెస్టుగా వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కూడా ఈ షోకు గెస్టుగా వస్తే.. ఈ ముగ్గురితో రెండు ఎపిసోడ్లు షూట్ చేయొచ్చని ఆహా టీమ్ భావిస్తోందట. ఇక ఆ తర్వాత ఎపిసోడ్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నాడట. ఇక మలయాళం సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) కూడా ఈ సీజన్లో గెస్టుగా రానున్నట్లు సమాచారం.