కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా.. ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా (Maha Kumbh Mela)కు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు తెలుగు యాత్రికులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టగా ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఏం జరిగిందంటే..?

సిమెంట్‌ లోడ్‌తో వెళ్తోన్న లారీ జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో హైవే పైకి రాంగ్‌ రూట్‌లో రావడంతో ఈ ప్రమాదం (Road Accident in Madhya Pradesh) చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరికొందరు యాత్రికులు మినీ బస్సులో చిక్కుకుపోయారని సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీసినట్లు వివరించారు.  క్షతగాత్రులను సిహోరా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పిన అధికారులు.. మృతులంతా హైదరాబాద్‌ నాచారం వాసులని తెలిసినట్లు వెల్లడించారు.

మృతులంతా హైదరాబాద్ వాసులే

ప్రమాదానికి గురైన వాహనం నంబరు AP29 W 1525గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్‌ ఆధారంతా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత భావించిన అధికారులు.. మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరంతా మహాకుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *