WPL: ఫైనల్‌కు ముంబై.. రేపు ఢిల్లీతో టైటిల్ పోరు

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2025)లో ముంబై ఇండియన్స్(MI) అదరగొట్టింది. గుజరాత్‌ టైటాన్స్‌(GT)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 47 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో జరిగిన మూడు ఎడిషన్లలో రెండో సారి ముంబై ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది. రేపు ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది.

Image

కాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్ మాథ్యూస్ (50 బంతుల్లో 77, 10ఫోర్లు, 3సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ నాట్‌ సీవర్‌బ్రంట్‌(41 బంతుల్లో 77, 10ఫోర్లు, 2సిక్స్‌లు)తోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ 12 బంతుల్లో 36 రన్స్‌తో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 213/4 భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో డానియెల్ గిబ్సన్‌ 2, కేశ్వీ గౌతమ్ ఒక వికెట్ తీశారు.

ఢిల్లీతో ధనాధన్ పోరు

అనంతరం భారీ టార్గెట్ ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టులో డానియెల్ గిబ్సన్‌ 34, లిచ్‌ఫీల్డ్ 31, ఫుల్మాలీ 30 మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 166 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో MI 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ 3, అమేలీ 2 వికెట్లు పడగొట్టారు. ఇక రేపు (మార్చి 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఫైనల్ పోరులో తలపడనుంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *