HOLI 2025: కలర్‌ఫుల్ హోలీ.. ఈ రంగుల పండగ ఎలా వచ్చిందంటే?

భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. హిందూ పంచాంగం(Hindu Almanac) ప్రకారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ(HOLI) పండుగ వస్తుంది. దేశవ్యాప్తంగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఈ రోజు రంగుల్లో తడిసి ముద్దవుతారు. హోలీనే హోళికా పూర్ణిమ(Holika Purnima) లేదా కాముని పున్నమిగా పిలుస్తుంటారు. మరి ఈ హోలీ పండుగ ఎలా వచ్చింది? అసలు ఎందుకు జరుపుకుంటారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Holi Festival 2025: హోళీ పండుగ ఎందుకు జరుపుకుంటారు..? పండుగ ప్రత్యేకత ఏంటి..?

హోలికా దహనం

హోలీ వెనుక గాథకు హిరణ్య కశ్యపుడు(Hiranakashyapudi), ప్రహ్లాదుని(Prahlad)కి మధ్య సంబంధం ఉంది. హిరణ్య కశ్యపుడు విష్ణు ద్వేషి అయితే ప్రహ్లాదుడు అపర భక్తుడు. అగ్నితో ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండే వరాన్ని పొంది ఉన్న హిరణకశ్యపుడి సోదరి హోలికా(Holika)తో ప్రహ్లాదుడిని ఒళ్లో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆదేశిస్తాడు. అలా చేస్తే ప్రహ్లాదుడు మరణిస్తాడని హోలికాకు ఎలాంటి ప్రమాదం తలెత్తదని హిరణకశ్యపుడు భావిస్తాడు.

Holi Festival | రేపే రంగులకేళీ..! హోలీ పండుగ విశిష్ఠ‌త ఏంటంటే..?-Namasthe  Telangana

కానీ అదే అగ్నిలో హోలికా దహనం కాగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటికొస్తాడు. ఈ ఘటనకు సంకేతంగా హోలికా దహనం చేస్తారు. ఇక హోలీ నాడు రంగులు చల్లుకోవడం వెనుక కూడా మరో కథ ప్రచారంలో ఉంది. పాలమీగడ వంటి రంగు కలిగిన రాధను చూసి కన్నయ్య(Lord Srikrishna) చిన్నబుచ్చుకోవడంతో యశోద రాధ ముఖానికి రంగు పులిమిందంటారు. అప్పటి నుంచి ఈ రోజున ఒకరిపై మరొకరు రంగులు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

Holi Festival | రేపే రంగులకేళీ..! హోలీ పండుగ విశిష్ఠ‌త ఏంటంటే..?-Namasthe  Telangana

కామ దహనం

తెలుగునాట హోలీని కామదహనం లేదా కాముడి పౌర్ణమిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు తన అమితబలంతో రుషులు, ప్రజలను బాధించసాగాడు. అతనికి శివుని సంతానం చేత మాత్రమే మరణం జరుగుతుందనే వరం ఉండటంతో అతనికి అడ్డుకట్ట వేయడం కష్టమైంది. శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండటంతో పార్వతిని ఆశీర్వదించేందుకు కాముడు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు. తపస్సుకు భంగం కలిగిన శివుడు కోపంతో తన మూడో కన్నును తెరిచాడు. దాంతో కాముడు భస్మమయ్యాడు. ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ హోలీ పండుగనాడు కామదహనం(Kamadahanam) నిర్వహిస్తారని ప్రతీతి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *