ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL-2025)లో ముంబై ఇండియన్స్(MI) అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్(GT)తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో 47 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో జరిగిన మూడు ఎడిషన్లలో రెండో సారి ముంబై ఫైనల్ చేరిన జట్టుగా నిలిచింది. రేపు ఫైనల్లో ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొట్టనుంది.
కాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఓపెనర్ మాథ్యూస్ (50 బంతుల్లో 77, 10ఫోర్లు, 3సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ నాట్ సీవర్బ్రంట్(41 బంతుల్లో 77, 10ఫోర్లు, 2సిక్స్‌లు)తోపాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ 12 బంతుల్లో 36 రన్స్‌తో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 213/4 భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో డానియెల్ గిబ్సన్ 2, కేశ్వీ గౌతమ్ ఒక వికెట్ తీశారు.
MUMBAI INDIANS Qualified Into The Final Of WPL 2025 !🔥#HayleyMatthew – 77 Runs & 3 Wickets !🙌🏻#NatalieSciverBrunt – 77 Runs & 1 Wicket !🙌🏻#AmeliaKerr – 2 Wickets !🙌🏻#HarmanpreetKaur – 36 Runs !🙌🏻
Complete All-rounder Performance From @mipaltan !🙌🏻#MIvsGG pic.twitter.com/wLUTJ9IQQo
— Aneesh (@Aneesh_98) March 13, 2025
ఢిల్లీతో ధనాధన్ పోరు
అనంతరం భారీ టార్గెట్ ఛేదనలో గుజరాత్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఆ జట్టులో డానియెల్ గిబ్సన్ 34, లిచ్‌ఫీల్డ్ 31, ఫుల్మాలీ 30 మాత్రమే రాణించారు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 19.2 ఓవర్లలో 166 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో MI 47 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ 3, అమేలీ 2 వికెట్లు పడగొట్టారు. ఇక రేపు (మార్చి 15) ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై ఫైనల్ పోరులో తలపడనుంది.






