రైలు పట్టాలపై కారు రయ్ రయ్.. ఫొటో వైరల్

రోడ్డుపై కార్లు వెళ్లడం సాధారణం. ఇప్పటివరకు మనం రహదారులపై కార్లు నడపడం చూశాం. కానీ రైలు పట్టాలపై కారు ప్రయాణించడం చూశారా..? తాజాగా అలాంటి ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం రామకృష్ణాపురం వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో రైలు పట్టాలపైకి కారు రావడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆ కారులో నుంచి రైల్వే అధికారి కృష్ణకుమార్ దిగడంతో అక్కడున్న వారంతా ఆసక్తిగా తిలకించారు.

రైలు పట్టాలపై కారు

రైలు పట్టాలపై కారు

డోర్నకల్ నుంచి పందిళ్ల పల్లి వరకు రేల్ టెస్టింగ్ ప్రాబ్లం ఉంటే తెలుసుకోవచ్చని ఆయన 107 గేట్ వరకు రైలు పట్టాలపై కారులో వచ్చారు. రైల్వే ట్రాకుపై ఇన్నాళ్లూ రైళ్లను మాత్రమే చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా కారు ప్రయాణించడంతో షాక్ అయ్యారు. ఇదేదో వింతగా ఉందంటూ ఆ కారును ఫొటోలు తీశారు. నయా టెక్నాలజీ అంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఇంతకీ రైల్వే పట్టాలపై కారు ప్రయాణించడమేంటని అనుకుంటున్నారా..?

రోడ్డు కమ్ రైల్ వే వ్యాన్

రైల్వే పట్టాల పని తీరును కారులో ప్రయాణిస్తూ పరీక్షించే కొత్త టెక్నాలజీ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. తక్కు వ సమయంలో ఎక్కువ కిలో మీటర్లు కారులో ప్రయాణిస్తూ రైలు పట్టాలు ఏలా ఉన్నాయో అధికారులు ప్రయాణిస్తున్నారు. ఈ కారును రోడ్డు కమ్‌ రైల్‌ వే(RCRV) వ్యాన్‌ అంటారు. ఈ వాహనాన్ని రోడ్డు పై టైర్లతో, రైలు పట్టాల పై ఇనుప చక్రాలతో నడిచే విధంగా రూపొందించారు. దీని సాయంతో రైల్వే అధికారులు ట్రాక్ ను సూపర్ వైజ్ చేస్తుంటారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *