Mohammad Intiyaz: సరిహద్దుల్లో కాల్పులు.. BSF ఎస్సై వీరమరణం

భారత్-పాకిస్థాన్‌ సరిహద్దు(India-Pakistan border)ల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్ఎస్ పురా సెక్టార్‌(RS Pura Sector)లో జరిగిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళానికి (BSF) చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్(SI) మహమ్మద్ ఇంతియాజ్(Mohammad Intiyaz) దేశం కోసం ప్రాణాలర్పించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, SI మహమ్మద్ ఇంతియాజ్ RSపురా సెక్టార్‌లోని ఒక BSF సరిహద్దు ఔట్‌పోస్ట్‌(Outpost)కు నేతృత్వం వహిస్తున్నారు. ఆ సమయంలో సరిహద్దు ఆవలి నుంచి దుండగులు కాల్పుల(open fire)కు తెగబడ్డారు.

అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి..

కాగా విధి నిర్వహణలో భాగంగా శత్రువులతో పోరాడుతూ అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించి మహమ్మద్ ఇంతియాజ్(Mohammad Intiyaz) అమరుడయ్యారని BSF అధికారులు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంది. కాగా అమర జవాన్ ఇంతియాజ్‌ పార్థివదేహానికి జమ్మూ(Jammu)లోని పలౌరాలో గల ఫ్రాంటియర్ హెడ్ క్వార్టర్స్‌(Frontier Headquarters)లో రేపు పూర్తి సైనిక లాంఛనాలతో నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *