మా పార్టీకి ఓట్లు క‌ష్ట‌మే..!

అమరావతి:రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి సతీమణి తప్పితే, ఇంకొక‌ మహిళ ఓటు వేయదని నరసాపురం ఎంపీ, వైసీపీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. రాష్ట్రంలో అంత దరిద్రంగా మన పార్టీ పరిస్థితి ఉన్నదని… కేవలం 370 కోట్ల అవినీతి ఆరోపణలకే జైల్లో పెట్టాలంటున్న జగన్మోహన్ రెడ్డి తనని తానే విమర్శించుకుంటున్నారన్న విషయాన్ని విస్మరిస్తున్నారని ర‌ఘురామ‌ ఎద్దేవా చేశారు.

రూ.43 వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై సాక్షాదారాలతో అభియోగాలు మోపితే కోర్టుకు వెళ్లకుండా, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నారని ప్రజలుఅనుకుంటున్నారన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎన్నడూ గడప దాటని మహిళలు కూడా రోడ్డు ఎక్కుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు ఆయన తల్లి, చెల్లి తప్పితే మరొక మహిళ రోడ్డు ఎక్కిన దాఖలాలు లేవు. చివరకు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వ్యవహారాలను చూసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ లక్షలాదిమంది మహిళలతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా రోడ్డెక్కారని తెలిపారు. పేదలకు, పెత్తందారులకు మధ్య పోరాటమని జగన్మోహన్ రెడ్డి తరుచూ చేస్తున్న వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ఎవరిది?, సజ్జల శాసిస్తున్న అంకె, అక్షరం కలిగిన చానల్స్ మీవే కదా??, ఇంగ్లీష్ పేపర్ కూడా మీ చేతిలోనే ఉంది కదా? అంటూ ప్రశ్నించారు. 43 వేల కోట్ల రూపాయల అవినీతి అభియోగాలను సాక్షాధారాలతో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కోర్టులకు సమర్పించగా, శ్రీనివాస్ లేడు పారిపోయాడని అంటున్నారు. మరి ఈ నాలుగేళ్లుగా నువ్వేమి చేశావు. కోర్టులకు వెళ్ళావా?? అంటూ నిలదీశారు. చివరకు కోడి కత్తి కేసులో ఇంటి పక్కనే ఉన్న ఎన్ఐఏ కోర్టుకు కూడా హాజరుకాకుండా తప్పించుకున్నావని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి ఆ పిచ్చికి పరీక్షలు చేయిస్తానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు, నాకు పిచ్చి అనేది లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో నలుగురు వైద్యుల చేత పరీక్షలు చేయించుకొని… పిచ్చి ఉందో లేదో నీకు నువ్వే నిరూపించుకోవాలని జగన్మోహన్ రెడ్డికి రఘురామకృష్ణం రాజు సూచించారు. అలాగే, నేను ఈ జబ్బుకు ఎటువంటి మందులు వాడడం లేదని స్పష్టం చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా ఆయనపై ఎదురు దాడి చేయడం వల్ల ప్రయోజనం శూన్యం. పవన్ కళ్యాణ్ మానసిక శాస్త్రవేత్త సిగ్నోమెండ్ ఫ్రైడ్ పుస్తకాలను అధికంగా చదువుతారు.

ఆయన తన పుస్తకాలలో చెప్పిన లక్షణాలను జగన్మోహన్ రెడ్డిలో పవన్ కళ్యాణ్ గుర్తించి ఉంటారు. అందుకే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తాను కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి నార్సి సిజం అనే మానసిక వైకల్యం ఉందని భావించాను. ఎందుకంటే తన ఫోటోలను తానే అధికంగా ప్రేమించడం, తన ఫోటోలు ఎక్కడ చూసినా ఉండాలని కోరుకోవడం ఈ జబ్బు యొక్క లక్షణం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి తన ఫోటోలను అంతటా ఉండాలని భావిస్తే, రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ బొమ్మలన్నీ చెరిపివేయాల్సిందే. అశాశ్వతమైన పదవుల కోసం ఊరంతా బొమ్మలు వేసుకోవడం సరికాదని పవన్ కళ్యాణ్ భావించి ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారని రఘురామకృష్ణం రాజు అన్నారు.

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు సూపర్ హిట్ అని పేర్కొన్న పవన్, బిజెపిని కన్వీన్స్ చేసి , పొత్తుకు అంగీకరించేలా ఒప్పిస్తానని చెప్పారు. బిజెపి కూడా పొత్తుకు అంగీకరిస్తుందని మనమందరం భావిద్దామని రఘురామకృష్ణం రాజు అన్నారు. టిడిపి నేతలు ఏమన్నా నోచుకోవద్దని జనసైనికులకు చెప్పారు. జన సైనికులు సమయమనం పాటించాలని ఆయన కోరారు. టిడిపి, జనసేన పొత్తును రెండు పార్టీలలోని 99 శాతం మంది శ్రేణులు స్వాగతిస్తుండగా, కేవలం ఒకటి రెండు శాతం మందికి మాత్రమే ఈ పొత్తు ఇష్టం ఉండకపోవచ్చు అని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

అజయ్ కల్లం పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా 161 స్టేట్మెంట్ ఇచ్చి, తరువాత తన స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకోవద్దని అజయ్ కల్లం దాఖలు చేసిన పిటిషన్ పై సిబిఐ 20 పేజీల కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అజయ్ కల్లం తన 161 స్టేట్మెంట్లో మార్పులు చేర్పులు కూడా చేసి సంతకం చేశారని, ఆయన స్టేట్మెంట్ వాయిస్ రికార్డు కూడా చేసినట్టు సిబిఐ వెల్లడించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన మరుసటి రోజు మేనిఫెస్టో కమిటీ సమావేశంలో పాల్గొన్నట్లు అజయ్ కల్లం వెల్లడించారు. ఉదయం ఐదు గంటలకు మేనిఫెస్టో కమిటీ సమావేశం ప్రారంభమైనట్లు, ఈ సమావేశంలో తనతో పాటు సాంబశివారెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, డి. కృష్ణ పాల్గొన్నట్టు వెల్లడించారు. ఉదయం ఐదున్నర గంటలకు అటెండర్ వచ్చి అమ్మ ( భారతి) పిలుస్తున్నట్లుగా చెప్పారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్లి భారతీ రెడ్డి తో మాట్లాడి వచ్చి,తన కూర్చునే స్థానం వద్దే నిలబడే చిన్నాన్న ఇక లేరని పేర్కొన్నారు. దీనితో మేమంతా షాక్ కు గురయ్యాము. కడప వెళ్ళేందుకు సిద్ధం కావాలని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించినట్లుగా అజయ్ కల్లం తన 161 స్టేట్మెంట్లో పేర్కొన్నారు. అజయ్ కల్లం నీతి నిజాయితీ కలిగిన అధికారి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన వ్యక్తి. ఆయన సిబిఐ కి 161 స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా జమోరె అండ్ గ్యాంగ్ కు తొలుత తెలియదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయనపై ఒత్తిడి చేసి తన స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవద్దంటూ తమ పార్టీ రాజ్యసభ సభ్యుడైన న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేయించి ఉంటారు. ఈ పిటిషన్ కచ్చితంగా తిరస్కరించబడుతుంది. అవినాష్ రెడ్డి ఎక్కడో ప్రచారానికి వెళుతుండగా ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడు శివప్రసాద్ రెడ్డి ఫోన్ చేయగా వచ్చి వైయస్ వివేకానంద రెడ్డి శవాన్ని సందర్శించినని ఆయన మీడియా ముందు చెప్పారు. అవినాష్ రెడ్డి చెప్పకపోతే వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినట్లు ఉదయం ఐదున్నర గంటలకే భారతి రెడ్డికి చెప్పింది ఎవరు?. నూటికి 99 శాతం అవినాష్ రెడ్డి అయి ఉండాలి. సిబిఐ దాఖలు చేసిన 165 పేజీల కౌంటర్ రిపోర్టులో అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి శ్రీమతి జగన్ ఫోన్ మధ్య సంభాషణ జరిగినట్లుగా గుర్తించామని తెలిపారు. అవినాష్ రెడ్డి, భారతీ రెడ్డి అటెండర్ నవీన్ ఫోన్లు ఒకే సమయంలో యాక్టివ్ గా ఉన్నట్లు చెప్పారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అర్ధరాత్రి రెండు , 2:45 గంటల మధ్య జరిగినట్లుగా ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా గుర్తించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్ 1:55 గంటలకు అవినాష్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్లుగా గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించుకున్నారు. అంతకుముందే ఎర్రగంగి రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లి అవినాష్ రెడ్డితో ఫోన్లో సంభాషించారు. ఇద్దరి ఫోన్లు ఒకే టైంలో యాక్టివ్ గా ఉన్నట్లు సిబిఐ నిర్ధారణకు వచ్చింది. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి భాగస్వామి అని సిబిఐ తేల్చేసింది. వైఎస్ వివేక హత్యకు గురైనట్లుగా ఉదయం ఐదున్నర గంటలకే జగన్మోహన్ రెడ్డి దంపతులకు తెలిసినట్లుగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 161 స్టేట్మెంట్ ఆధారంగా స్పష్టమవుతుంది. హత్య విషయం ముందే తెలిసినా జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎందుకు ఈ విషయాన్ని చెప్పలేదు. ఉదయం 8:30 గంటల వరకు సాక్షి మీడియాలో వైయస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినట్లుగా కథనాలను ఎందుకు నడిపించారు. లోటస్ పాండ్ ప్యాలెస్ సమీపంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూడా గుండెపోటుతో మరణించారని ఎందుకు చెప్పారు. హెలిక్యాప్టర్, విమానం అందుబాటులో ఉన్నప్పటికీ వైయస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు కారులోనే పులివెందులకు ఎందుకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హత్య జరిగిన విధానాన్ని పూసగుచ్చినట్లు ఎలా వివరించగలిగారు. గతంలో నన్ను లాకప్లో చిత్రహింసలకు గురి చేసినప్పుడు వీడియో ద్వారా సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ చూపెట్టారు. ఇప్పుడు కూడా అలాగే చూపెట్టారేమో నాకు తెలియదు. హత్య జరిగిన తీరును జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరు వర్ణనాతీతం. అజయ్ కల్లం స్టేట్మెంట్ పరిశీలిస్తే, విచారణలో ఎన్ని గంటలకు వైఎస్ వివేకా హత్య గురించి తెలిసిందో చెప్పాల్సిందే. ఈ హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉండకపోవచ్చు. ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను.

అన్ని విషయాలు తెలిసిన తర్వాత కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నట్లుగా ప్రజలను మభ్య పెట్టేందుకు సాక్షి దినపత్రికలో నారా సుర రక్త చరిత్ర అనే కథనాన్ని ఎందుకు రాశారు. అజయ్ కల్లం స్టేట్మెంట్ పరిగణలోకి తీసుకొని సిబిఐ తనని విచారించే అవకాశం ఉందని భావించిన జగన్మోహన్ రెడ్డి , ప్రజల దృష్టిని మరల్చడానికే స్కిల్ డెవలప్మెంట్ స్కీం కేసులో ఉద్దేశపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసి ఉంటారని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

Related Posts

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

గన్నవరం చేరుకున్న ప్రధాని.. కాసేపట్లో అమరావతికి మోదీ

అమరావతి పునరుద్ధరణ పనుల(For Amaravati renovation works)కు శ్రీకారం చుట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గన్నవరం విమానాశ్రయాని( Gannavaram Airport)కి చేరుకున్నారు. ఆయనకు ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రులు అనిత, అనగాని, వాసంశెట్టి స్వాగతం పలికారు.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *