The Road OTT | ఓటీటీలోకి వ‌స్తున్న త్రిష ‘ది రోడ్’..!

The Road Movie | ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది రోడ్ (The Road)‌. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. అరుణ్‌ వసీగరన్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు.

The Road Movie | ‘పొన్నియన్ సెల్వన్’ వంటి భారీ హిట్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ది రోడ్ (The Road)‌. రివెంజ్ ఇన్ 462 కిలోమీటర్స్ (Revenge in 462 kms) అనేది ఉప శీర్షిక. అరుణ్‌ వసీగరన్ ద‌ర్శక‌త్వం వ‌హించాడు. డ్యాన్సింగ్‌ రోజ్‌గా పాపులర్‌ అయిన మాలీవుడ్‌ నటుడు షబీర్ (Shabeer Kallarakkal) ఈ సినిమాలో కీ రోల్‌ పోషించాడు. అక్టోబర్‌ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలో త్రిష న‌ట‌న‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.

ప్రముఖ త‌మిళ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా(Aha)లో న‌వంబ‌ర్ 06 నుంచి స్ట్రీమింగ్ అవ్వనున్నట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో వెల్లడించారు. మొదట ఈ చిత్రాన్ని తమిళ ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత వివిధ భాషల్లో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన‌ ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతం అందించాడు.

Related Posts

Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ అప్డేట్.. ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), దర్శకుడు బుచ్చిబాబు సానా(Bucchibabu Sana) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న‌ లేటెస్ట్ మూవీ ‘పెద్ది(Peddi)’. ఈ చిత్రాన్ని స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది.…

Kishkindhapuri: బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కింధపురి’ మూవీ రిలీజ్ తేదీ ఎప్పుడంటే?

‘భైరవం(Bhairavam)’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) తర్వలో ‘కిష్కింధపురి(Kishkindhapuri)’ చిత్రంతో రాబోతున్నాడు. ఫాంటసీ హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) హీరోయిన్‌గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్ళపాటి(Kaushik…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *