Actress Jeevitha Rajasekhar: సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ఫిల్మ్‌ బోర్డుకు ఫిర్యాదు.. ‘నాకు ఆపార్టీతో ఏ సంబంధం లేదు’

సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమాను సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అక్కడ సెన్సార్‌ ఆర్‌సీలో సభ్యులుగా కొనసాగుతోన్న సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ వైసీపీ నేత అని, ఆమె గనుక..

సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌పై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమెను తాత్కాలికంగా సెన్సార్ ఆర్‌సీ సభ్యత్వం నుంచి తొలగించాలంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమాను సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ రిజెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో సెన్సార్ ఆర్‌సీకి ఈ సినిమాను రిఫర్‌ చేశారు. అక్కడ సెన్సార్‌ ఆర్‌సీలో సభ్యులుగా కొనసాగుతోన్న సీనియర్‌ నటి జీవిత రాజశేఖర్‌ వైసీపీ నేత అని, ఆమె గనుక అక్కడ ఉంటే ఈ సినిమాకు పారదర్శకంగా సెన్సార్‌ జరగదని, అందుకే ఆమెను ఈ సినిమా వరకు తాత్కాలికంగా సభ్యత్వం నుంచి తొలగించాలంటూ నిర్మాత నట్టి కుమార్‌ సెంట్రల్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. ఈ సినిమా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాంతరం ఏపీలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు వర్మ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్తిగా అనుకూలంగా, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులను వ్యంగ్యంగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. అందులోని పాత్రలను వారి పోలికలకు దగ్గరగా ఉన్న నటీనటులను ఎంపిక చేసుకుని, ఈ సినిమాలో వారి పాత్రలను వ్యంగ్యంగా చూపించారు. ఈ విషయం తాజాగా విడుదలైన వ్యూహం సినిమా టీజర్‌ చూస్తే తెలుస్తుంది.

ఈ నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాను సెన్సార్ కోసం పంపించగా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి బోర్డు నిరాకరించింది. దీంతో ఈ సినిమాను సెన్సార్ ఆర్‌సీకి రిఫర్‌ చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్‌ అభ్యంతరం తెలుపుతూ సెన్సార్‌ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ‘వ్యూహం సినిమా పూర్తిగా తెలుగు పొలిటికల్‌ ఫీచర్‌ సినిమా అని. ప్రస్తుతం తెలంగాణతోపాటు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేసినట్లయితే శాంతి భధ్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని ఎదురవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related Posts

Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ‘డాకు మ‌హారాజ్‌(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు మంచి ఎమోష‌న్(Emotions) కూడా ఉండ‌డంతో తొలి ఆట…

Pushpa-2 TheRule: తగ్గిన ‘పుష్ప2’ టికెట్ రేట్లు.. రేపటి నుంచి రీలోడెడ్ వెర్షన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *