Bigg Boss 7 Telugu: స్ట్రాటజీలు నేర్పుతున్నావా..? గౌతమ్ పై శివాజీ సీరియస్

హౌస్ లో ఉన్న వారు వీర సింహాలు, గర్జించే పులులు రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పై నుంచి పడుతున్న చిన్న చిన్న బాల్స్ ను సేకరించి దాచిపెట్టారు. వాటిని కొట్టేయడానికి అపోజిట్ టీమ్ తెగ ప్రయత్నించింది. నిన్నటి ఎపిసోడ్ లో గోల్డెన్ బాల్ ను వీర సింహాలు దక్కించుకున్నారు. దాంతో వారికి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన హాల్ ఆఫ్ బాల్ టాస్క్ కంటిన్యూ అవుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా హౌస్ మేట్స్ బాల్స్ ను సేకరించారు. హౌస్ లో ఉన్న వారు వీర సింహాలు, గర్జించే పులులు రెండు టీమ్స్ గా డివైడ్ చేసిన విషయం తెలిసిందే. ఇక పై నుంచి పడుతున్న చిన్న చిన్న బాల్స్ ను సేకరించి దాచిపెట్టారు. వాటిని కొట్టేయడానికి అపోజిట్ టీమ్ తెగ ప్రయత్నించింది. నిన్నటి ఎపిసోడ్ లో గోల్డెన్ బాల్ ను వీర సింహాలు దక్కించుకున్నారు. దాంతో వారికి ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. తమ టీమ్ నుంచి వీక్ ప్లేయర్ ను అపోజిట్ టీమ్ కు ఇచ్చి అక్కడి నుంచి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ను తమ టీమ్ లోకి తీసుకోవాలి. దాంతో గౌతమ్ టీమ్ అర్జున్ ను తమ టీమ్ లోకి తీసుకొని భోలే ని గర్జించే సింహాలు టీమ్ లోకి తోసేశారు.
ఆతర్వాత హౌస్ మేట్స్ దగ్గరున్న బాల్స్ ను కాపాడుకోవడం వారి బాధ్యతే అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో అపోజిట్ టీమ్ దగ్గరున్న బాల్స్ ను కొట్టెయ్యొచ్చు అని గౌతమ్ ప్లాన్ వేశాడు. దాంతో శివాజీ సీరియస్ అయ్యాడు. తొక్క తీస్తా నా బాల్స్ జోలికొస్తే అని వార్ నింగ్ ఇచ్చాడు. దాంతో తేజ వచ్చి అది గేమ్ అన్న.. బిగ్ బాస్ చెప్పింది అదేగా అని అన్నాడు. అయినా సరే శివాజి దానికి ఒప్పుకోలేదు. ఇంతలో గౌతమ్ మధ్యలో దూరి. అన్న అది గేమ్ అన్న. దొంగతనం అంటే నిజంగా దొంగతనం కాదు.. పెళ్ళిలో చెప్పులు దాచేస్తారు చూడూ.. అలా అంటూ ఎదో చెప్పడానికి ప్రయత్నించాడు.

ఇంతలో శివాజీ నువ్వు చెప్పింది పరమ వరస్ట్ లాజిక్ అది.. దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందట్రా.. అని అన్నాడు. దాంతో గౌతమ్ రెచ్చిపోయాడు. మనం బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నది దేనికి అని గౌతమ్ అంటే.. దొంగతనాలు చేసుకోవడానికా.. అరె తీసి అన్ ఫెయిర్ గేమ్ ఆడద్దు అంటున్నా.. అంటూ శివాజీ సీరియస్ అయ్యాడు. అన్ ఫెయిర్ ఎట్ల అవుతది.. మరి మీ తెలివి ఫిజికల్‌గా మెంటల్‌గా ఉపయోగించమని ఎందుకు బిగ్‌బాస్ చెప్పాడు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు గౌతమ్. శక్తి ఉంది కదా అని చేయికోసి తీసేస్తావా..? అని ప్రశ్నించాడు శివాజీ. అది స్ట్రాటజీ అన్న అని గౌతమ్ అంటే.. స్ట్రాటజీ ఏంట్రా బాబూ దొబ్బేయడం స్ట్రాటజీ ఏంటి.. రేయ్ నువ్వు డాక్టర్‌వి అలా మాట్లాడకూడదురా క్యారెక్టర్, ఎథిక్స్ ముఖ్యం అంటూ శివాజీ క్లాస్ పీకాడు.. ఫైనల్ గా.. కావాలంటే నా బాల్స్ వెళ్లి తీసుకోండి.. నేను మిమ్మల్ని కూడా ఏమనను తీసుకోండి.. గేమ్‌లు స్ట్రాటజీలు అని నాకు నేర్పుతున్నాడు అంటూ శివాజీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

Related Posts

Daaku Maharaaj: బాక్సాఫీస్ వద్ద బాలయ్య హంటింగ్.. ‘డాకు’ కలెక్షన్స్ ఇవే?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ(Director Bobby) ద‌ర్శ‌క‌త్వంలో మూవీ ‘డాకు మ‌హారాజ్‌(Daaku Mahaaraj)’. సంక్రాంతి(Sankranti) కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అభిమానుల‌కు కావాల్సిన యాక్ష‌న్‌తో పాటు మంచి ఎమోష‌న్(Emotions) కూడా ఉండ‌డంతో తొలి ఆట…

Pushpa-2 TheRule: తగ్గిన ‘పుష్ప2’ టికెట్ రేట్లు.. రేపటి నుంచి రీలోడెడ్ వెర్షన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్‌ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి(DEC 5th) దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *