Tollywood:పేకాటలో మహేశ్‌ బాబు, విక్టరీ వెంకటేశ్‌.!

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, విక్టరీ వెంకటేశ్‌ పేకాట ఆడిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఓ పార్టీలో పాల్గొన్న వీరిద్దరూ సరదాగా కాసేపు పేకాడుతూ కనిపించారు. అయితే, ఇంత పబ్లిక్ గా పేకాట ఆడే సాహసం ఎలా చేశారా? అని వీరి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, విక్టరీ వెంకటేశ్‌ గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ముల పాత్రలో కనిపించారు. ఆ క్యారెక్టర్స్‌కు ఇప్పటికీ జనాల్లో క్రేజ్‌ అలాగే ఉంది. మహేశ్ బాబు చిన్నోడిగా, వెంకటేశ్ పెద్దోడిగా అలరించారు. అన్నదమ్ముల మధ్య బాండింగ్‌ను అద్భుతంగా చూపించారు.

మహేష్ బాబు-వెంకటేష్ చాలా రిజర్వ్డ్ గా ఉంటారు. పనుంటే తప్ప బయటకు రారు. తమ చిత్రాల ప్రొమోషన్స్ లో మినహాయిస్తే పెద్దగా కనిపించరు. పక్కా ప్రొఫెషనల్ గా ఉంటారు. కాగా, వీరిద్దరికి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్లబ్ లో పేకాటరాయళ్ళుగా కనిపించారు. టేబుల్ మధ్యలో లక్షల రూపాయలు ఉన్నాయి. మహేష్ చేతిలో పేక ముక్క ఉండగా.. వెంకీ కూర్చున్న ముందు టేబుల్ పై పేకలు ఉన్నాయి.
అయితే, ఇంత పబ్లిక్ గా క్లబ్ లో పేకాట ఆడే సాహసం ఎలా చేశారని ప్రిన్స్ మహేశ్ బాబు ఫ్యాన్స్, విక్టరీ వెంకటేశ్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే, ఈ ఫొటోలపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరేమో, హైదరాబాదులో ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన పార్టీకి హాజరైన ఈ ఇద్దరూ సరదాగా కాసేపు పేకాట ఆడారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరికొందరేమో, సన్నిహితుల కొత్త క్లబ్ ఓపెనింగ్ కి గెస్ట్స్ గా వెంకటేష్, మహేష్ బాబు హాజరయ్యారని.. అది కాసినో టైప్ క్లబ్ కావడంతో సరదాగా కాసేపు అలా పేకాట ఆడారని అంటున్నారు. ఆ సమయంలో ఎవరో దూరం నుండి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్తా వైరల్ అయి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Popular