CRICKET : ఇండియా vs ఇంగ్లాడ్ టెస్ట్ మ్యాచ్..TSRTC ప్రత్యేక బస్సులు

మన ఈనాడు: ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌ జరగనున్న వేళ.. టీఎస్‌ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిజూ ఉదయం 8 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్‌ స్టేడియంలో గురువారం నుంచి ఐదు రోజుల పాటు ఇండియా VS ఇంగ్లాండ్ తొలి టెస్ట్ మ్యాచ్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఈ టెస్ట్ మ్యాచ్‌ కోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి.. ఉప్పల్ స్టేడియం వరకు ఏకంగా 60 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత తిరిగి రాత్రి 7 గంటలకు స్టేడియం నుంచి బయలుదేరుతాయి. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకునే క్రికెట్ అభిమానులు ఈ ప్రత్యేక బస్సుల సేవలను వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. ఇక బస్సు రూట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

 

Related Posts

SRH vs PBKS: అభిషేక్ ఊచకోత.. పంజాబ్‌పై సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

వారెవ్వా.. వాట్ మ్యాచ్.. ఏమా ధైర్యం.. ఏమిటా హిట్టింగ్.. వరల్డ్స్ క్లాస్ బౌలర్లను చిత్తు చేస్తూ అభిషేక్ వర్మ చేసిన విధ్వంసం గురించి ఏమని చెప్పాలి.. ఎంతని చెప్పాలి.. ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన…

IPL ఓపెనింగ్ సెర్మనీ.. సందడి చేయనున్న బాలీవుడ్ సెలబ్రిటీలు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం క్రికెట్ లవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు. మార్చి 22న ప్రారంభం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *