దియా పోలీసు బలగాల్లో దిట్ట!

హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ ఐఐటీఏలో సుమారు ఎనిమిది నెలల పాటు శిక్షణ పూర్తిచేసుకున్న జాగిలం దియాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కేటాయించడంపై ఎస్పీ రోహిత్‌రాజు హర్షం వ్యక్తం చేశారు.

దియా పేలుడు పదార్థాలను గుర్తించడంలో దిట్ట. ప్రత్యేకంగా శిక్షణ పొందిన జాగిలాన్ని జిల్లాకు కేటాయించారు.

జాగిలం హ్యాండ్లరుగా వ్యవహరిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ మహేందర్‌, ఇతర డాగ్‌స్క్వాడ్‌ అధికారులు, సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్‌ శాఖలో పదకొండు జాగిలాలు సేవలందిస్తున్నాయి. వాటి వివరాలను అధికారులను అడిగి ఎస్పీ తెలుసుకున్నారు.

జాగిలాల రక్షణ, వసతి ఏర్పాట్లలో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Related Posts

Prakash Raj: బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. ఈడీ విచారణకు హాజరైన ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం సిని ఇండస్ట్రీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అనుమానిస్తోంది. నిందితులుగా ఉన్న కొందరు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. పలువురు నటీనటుల మీద…

Payal Rajput: నటి పాయల్ రాజ్‌పుత్ ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ హీరోయిన్ నటి పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి విమల్ కుమార్ రాజ్‌పుత్(Vimal Kumar Rajput) (67) ఢిల్లీలో సోమవారం కన్నుమూశారు. ఈ విషాద సంఘటనను తాజాగా పాయల్ సోషల్ మీడియా(SM) ద్వారా వెల్లడించింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *