EX MLA Saidi Reddy: బీజేపీలోకి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి..!

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుసగా షాక్​లు తగులుతున్నాయి. హుజూర్​నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తాజాగా బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

EX MLA Saidi Reddy తాజాగా బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలోకి చేరనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈయనను బీజేపీ నుంచి నల్గొండ పార్లమెంట్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టింది.

అయితే ఖమ్మం నుంచి కూడా మరో సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేతను చేర్చుకునేలా బీజేపీ ప్రణాళికలు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు (KCR) పంపారు. తాజాగా ఆయన తరుణ్‌ చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నిన్న (గురువారం) బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ రాములు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. వరుస నేతల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ మెల్లగా ఖాళీ అవుతోంది. ఇటీవల మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో కుటుంబ సమేతంగా కాంగ్రెస్ లో చేరారు. ఆయనతో పాటు హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ తదితర బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *