కాంగ్రెస్​ తొలి జాబితాలో తొమ్మిది మందికి అవకాశం..

మన Enadu: నాలుగు రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల అవుతుందన్న ప్రచారంతో కాంగ్రెస్​ పెద్దలు అలర్ట్​ అయ్యారు. ఎంపీ అభ్యర్థుల పేర్లును ఖారారు చేసే పని పూర్తి చేశారని సమాచారం. నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో తెలంగాణ నుంచి తొలిజాబితా తొమ్మిదిమంది పేర్లు దాదాపుగా ఖారారు చేశారని రేపు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

సికింద్రాబాద్​ నుంచి అనూహ్యంగా మరో పేరు తెరమీదకి వచ్చింది. బీసీ సామాజిక వర్గంతోపాటు సికింద్రాబాద్​ ప్రాంతంలో యాదవ్​ బలమైన సామాజిక వర్గం ఉంది. ఈక్రమంలో మాజీ మేయర్​ బొంతు రామ్మోహన్​ సతీమణి ప్రస్తుతం చర్లపల్లి కార్పొరేటర్​గా ఉన్న బొంతు శ్రీదేవి పేరును ఖారారు చేసినట్లు తెలిసింది.

మహబూబాబాద్​ నుంచి విజయాబాయి, మహబూబ్​నగర్​ నుంచి వంశీరెడ్డి, కరీంనగర్​ నుంచి ప్రవీణ్​ రెడ్డి, నిజామాబాద్​ నుంచి జీవన్​రెడ్డి, జహీరాబాద్​ నుంచి సురేష్​ పెట్కార్​, చేవళ్ల నుంచి సునితా మహేందర్​రెడ్డి, నాగర్​కర్నూల్​ నుంచి మల్లు రవి పేర్లు ఖారారు చేశారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *