Tillu Square Review: ‘టిల్లు స్క్వేర్’ రివ్యూ.

Tillu Square Twitter Review: ప్రేక్షకులతో విజిల్స్​ వేయించిన ‘డీజే టిల్లు’ మూవీకి సీక్వెల్‌ అయిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఈ రోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి మల్లిక్ విమల్ దర్శకత్వం వహించారు.

ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఈ మూవీ నేడు రిలీజ్ కావడంతో పలువురు ట్విట్టర్ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

సోషల్​ మీడియాలో మాత్రం సినీ ప్రియులు ఈ మూవీపై రివ్యూ ఇస్తున్నారు. అందులో ఓ నెటిజన్.. టిల్లు స్క్వేర్ మూవీ చాలా ఫన్‌గా ఉందని.. సిద్దు పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ‘డీజే టిల్లు’లో రాధికగా అలరించిన నేహాశెట్టి ఎంట్రీ సీన్ అందరినీ సర్ప్రైజ్‌ చేసిందన్నారు.

అలాగే మరొకరు రాస్తూ.. టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని అన్నారు. అయితే సిద్దు మాత్రం తన ఎనర్జిటిక్ అవతార్‌లో దుమ్ము దులిపేశాడని ఈ మూవీని సిద్దు తన భుజాలపై మోశాడని అంటున్నారు.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *