Kalki:కల్కి’లో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడు.. బాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్

ManaEnadu: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్‌ లుక్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర జోకర్‌లా ఉందని అన్నాడు. ఇప్పుడు అర్షద్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అర్షద్.. తాను ‘క‌ల్కి’ సినిమా చూశానని కానీ తనకు నచ్చలేదని చెప్పాడు.

ఇక ఆ సినిమా గురించి మాట్లాడుతూ.. ఆ చిత్రంలో హీరో ప్రభాస్ కాకుండా అమితాబ్ బచ్చన్ పాత్ర ఎక్కువగా హైలైట్ అయిందని అన్నాడు.  అశ్వత్థామతో పోలిస్తే, ప్రభాస్‌ నటించిన భైరవ పాత్ర తేలిపోయిందని చెప్పాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రభాస్ ను తెరపైకి చూసి నాకు బాధ కలిగింది. ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది ప్రభాస్. కానీ ఆయన పాత్రకు సంబంధించిన లుక్ జోకర్ లా ఉంది. ప్రభాస్.. మ్యాడ్ మ్యాక్స్ తరహా మూవీలో నటిస్తే చూడాలని ఉంది. మెల్ గిబ్సన్ లా నిన్ను చూడాలని ఉంది ప్రభాస్. కానీ మీరెందుకు ఇలాంటి పాత్ర చేశారో నాకర్థం కాలేదు. అంటూ అర్షద్ వార్సీ కామెంట్స్ చేశాడు.

ఇక  అమితాబ్‌ బచ్చన్ పాత్ర గురించి మాట్లాడుతూ అశ్వత్థామ పాత్ర పవర్ ఫుల్ గా ఉందని అన్నాడు. ఈ వ‌య‌సులో క‌ల్కి లాంటి సినిమాలు ఆయన ఎలా చేస్తున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆయ‌న‌లో ఉన్న శక్తిలో కొంచెమైనా ఉంటే లైఫ్ సెట్ అయిపోతుందని అర్షద్ వార్సీ బిగ్ బీపై ప్రశంసలు కురిపించాడు.

అయితే ప్రభాస్ పై వార్సీ చేసిన కామెంట్స్ పై డార్లింగ్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అర్షద్ కామెంట్స్ విని వాళ్లు అప్ సెట్ అయ్యారు. కొత్త జానర్ లో వచ్చే సినిమాలను నటులు ఎందుకు ప్రోత్సహించరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలాంటి ఈర్ష్య వల్లే బాలీవుడ్ ఫెయిల్ అవుతోందని ఇంకో నెటిజన్ అన్నాడు. 

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *