PARIS PARALYMPICS 2024 : పారిస్​లో మళ్లీ క్రీడాసంబురం.. నేటి నుంచే పారా ఒలింపిక్స్

ManaEnadu:పారిస్‌ ఒలింపిక్స్‌ 2024 (Paris Olympics) ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇదే వేదికగా మరో క్రీడావేడుక షురూ కాబోతోంది. ఇవాళ్టి (ఆగస్టు 28వ తేదీ) నుంచి పారిస్ వేదికగా పారా ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రీడల్లో 168 దేశాల నుంచి 4400 మంది దివ్యాంగ అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. డిలా కాంకార్డ్‌ వేదికగా పారాలింపిక్స్‌ ప్రారంభోత్సవం జరగనుంది. సెప్టెంబర్‌ 8వ తేదీన ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు.

పారా ఒలింపిక్స్​ (Paralympics 2024)లో మహిళలకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈసారి 10 కొత్త ఈవెంట్లను తీసుకొచ్చారు. ఈ పారిస్ పారాలింపిక్స్​లో భారత్‌ తరఫున 84 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. టేబుల్‌ టెన్నిస్ (Table Tennis), రోయింగ్‌ (2), పారా కనోయింగ్‌ (3), పవర్‌లిఫ్టింగ్‌ (4), ఆర్చరీ (6), అథ్లెటిక్స్​(38), తైక్వాండో, షూటింగ్‌ (10), బ్యాడ్మింటన్‌ (13), స్విమ్మింగ్‌ (1), సైక్లింగ్, జూడోలో పోటీ పడుతున్నారు.

2020 టోక్యో పారాలింపిక్స్‌ (Tokyo Paralympics )లో భారత్‌ 5 గోల్డ్ మెడల్స్​ సహా 19 పతకాలను దక్కించుకుంది. ఈ సారి పారిస్ పారాలింపిక్స్​లో 25 మెడల్స్​ లక్ష్యంగా పెట్టుకుంది. ఆరంభోత్సవ వేడుకలో సుమిత్‌ అంటిల్‌ (అథ్లెటిక్స్‌), భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరిస్తారు. , కొంగనపల్లి నారాయణ (రోయింగ్, నంద్యాల), జీవాంజి దీప్తి (400 మీటర్ల టీ20 పరుగు, వరంగల్‌), రొంగలి రవి (షాట్‌పుట్‌, అనకాపల్లి), షేక్‌ అర్షద్‌ ( తైక్వాండో, నంద్యాల) తెలుగు రాష్ట్రాల నుంచి పారా ఒలింపిక్స్​ బరిలోకి దిగుతున్నారు. ఇక తొలిసారిగా భారత్ అంధుల జూడో, రోయింగ్, సైక్లింగ్ అథ్లెట్లను రంగంలోకి దింపింది.

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *