Rajasekhar: చాలా గ్యాప్ తర్వాత వస్తోన్న రాజశేఖర్.. కొత్త మూవీ టైటిల్ ఇదే!

Mana Enadu: తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోల్లో రాజశేఖర్(Rajashekar) ఒకరు. 90ల్లో ఆయన అగ్ర కథానాయకులకు దీటుగా హిట్లు మూవీలు అందుకున్నారు. కానీ ఆ తర్వాత శేఖర్ మూవీలు బాక్సాఫీస్(Box office) వద్ద బోల్తా కొట్టడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్‌కు చెప్పుకోదగ్గ హిట్ అంటే.. ‘గరుడవేగ(Garudavega)’ మాత్రమే. చాలా ఏళ్ల తర్వాత ఆ చిత్రంతో ఓ మంచి విజయం సాధించాడు కానీ.. తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. గత ఏడాది ‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్’ చిత్రంలో ప్రత్యేక పాత్రతో రీఎంట్రీ ఇచ్చాడు కానీ.. అది కూడా డిజాస్టర్ కావడంతో ఏం ప్రయోజనం లేకపోయింది. మళ్లీ విరామం తీసుకున్న రాజశేఖర్.. హీరోగా ఇటీవలే మరో సినిమాను లైన్లో పెట్టాడు. ఆ చిత్రానికి తన కల్ట్ సినిమాల్లో ఒకదాని టైటిల్ వాడుకుంటుండడం విశేషం.

 గతంలో మెగాస్టార్ మూవీలకు ఉన్నంత ఓపెనింగ్స్

గతంలో రాజశేఖర్ సినిమా అంటే మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) మూవీలకు ఉన్నంత ఓపెనింగ్స్ ఉండేవి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉండేది. అయితే గత పదేళ్లలో రాజశేఖర్ అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత చేసిన కల్కి(Kalki), శేఖర్ సినిమాలు రాజశేఖర్‌ను మళ్లీ థియేటర్ల వద్ద తేలిపోయాయి. అయితే వీటన్నింటిని తట్టుకొని మరి ఆయన నిల్చున్నారు. ఇప్పటికీ తనలో ప్రేక్షకులను(Audians) ఎంటర్‌టైన్ చేసే సత్తా ఉందని నిరూపించేందుకు ఓ పవర్ ఫుల్ టైటిల్‌తో వస్తున్నాడు రాజశేఖర్.

 బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డు

డైరెక్టర్ పవన్ సాధినేని(Pawan Sadineni) తెరకెక్కిస్తున్న మూవీలో రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారు. తాజగా ఈ మూవీ టైటిల్ ‘మగాడు(Magadu)’గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇదే టైటిల్ తో 90ల్లో అతనే హీరోగా ఓ సినిమాలో నటించాడు. ఆ టైటిల్‌ను రిపీట్ చేస్తూ.. మరోసారి హీరోగానే రాబోతున్నాడు రాజశేఖర్. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణలో ఉంది. త్వరలోనే మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి. ఈ సినిమాలో రాజశేఖర్ నటనకు బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ (Filmfare Award) రావడం విశేషం. కాగా ఈ ఏడాది చివర్లో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *