Mana Enadu: హరియాణా అసెంబ్లీ(Haryana elections) ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా(postponed) వేసింది. ఈ ఎన్నికలను జమ్మూకశ్మీర్( Jammu and Kashmir)తో కలిపి నిర్వహించనుంది. ఫలితాను కూడా ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి వెల్లడించనుంది. శతాబ్దాల నాటి అసోజ్ బిష్ణోయ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హరియాణాలోని బిష్ణోయ్ కమ్యూనిటీ ప్రజలు రాజస్థాన్‌కు తరలివెళ్తారు. దీంతో అధిక సంఖ్యలో ఓటర్లు తమ హక్కును వినియోగించుకోలేకపోతారు. దీని ప్రభావం హరియాణా అసెంబ్లీ ఎన్నకల( Haryana assembly elections)పై పడుతుందనే వాదనలతో పోలింగ్ తేదీని, కౌంటింగ్ తేదీని మార్చినట్టు ఈసీ( Election Commission Of India) వెల్లడించింది. కాగా ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా ఎన్నికలు అక్టోబర్ 5న నిర్వహిస్తామని వెల్లడించింది. అలాగే ఫలితాలను అక్టోబర్ 8కి మార్చింది.
బిష్ణోయ్ కమ్యూనిటీ విన్నపంతో వాయిదా
ఇదిలా ఉండగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీని రీషెడ్యూల్(Reshedule) చేయాలని రాజస్థాన్ బికనీర్‌లోని ఆల్ ఇండియా బిష్ణోయ్ మహాసభ (All India Bishnoi Mahasabha) జాతీయ అధ్యక్షుడు ఈసీకి వినతిపత్రం అందించారు. ఈ ఏడాది అక్టోబర్ 2న గురు జంభేశ్వర్ స్మారకోత్సవం జరుగుతుండగా, సిర్సా, ఫతేహాబాద్, హిసార్‌లలో నివసిస్తున్న వేలాది బిష్ణోయ్ కుటుంబాలు ఆ రోజు రాజస్థాన్‌కు వెళ్లనున్నాయి. తమ గురు జంభేశ్వర్ జ్ఞాపకార్థం అసోజ్ అమావాస్య ఉత్సవ( Asoj Amavasya festival celebration) వేడుకలో పాల్గొనే శతాబ్దాల సంప్రదాయాన్ని బిష్ణోయ్ కమ్యూనిటీ ఎన్నికల సంఘానికి వివరించింది. దాంతో, ఆ రోజు హరియాణాలో జరిగే పోలింగ్‌ను వాయిదా వేయాలని ఈసీ నిర్ణయించింది.
పదేళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు
మరోవైపు అక్టోబర్ 1వ తేదీకి ముందు, వెనుక సెలవులు ఉన్నాయని, అందువల్ల, ఆ తేదీన పోలింగ్ నిర్వహిస్తే, అది పోలింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని బీజేపీ ఇటీవల ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది చివర్లో జమ్మూకశ్మీర్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, హరియాణా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావించింది. మరోవైపు దాదాపు 10 ఏళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ చివరిసారిగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.