ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన టాలీవుడ్ యంగ్ కపుల్ ఇప్పుడు ఓ శుభవార్త చెప్పారు. తామిద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నామంటూ తీపికబురు అందించారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ ఈ కొత్త జంట తమ సంతోషాన్ని తమ అభిమానులు, శ్రేయోభిలాషులతో షేర్ చేసుకుంది. ఇంతకీ ఆ జంట ఎవరంటే..?
పేరెంట్స్ కాబోతున్న రాజావారు రాణిగారు
మన టాలీవుడ్ ‘రాజావారు రాణిగారు’ అదేనండి.. యంగ్ హీరో కిరణ్ అబ్బ వరం (Kiran Abbavaram), నటి రహస్య గోరక్ (Rahasya Gorak) ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ఓ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. తాను తండ్రిని కాబోతున్నానంటూ.. తామిద్దరం త్వరలో ముగ్గురం కాబోతున్నామంటూ కిరణ్ అబ్బవరం నెట్టింట ఓ పోస్టు పెట్టాడు.
Our love is growing by 2 feet 👣👼🐣 pic.twitter.com/69gL0sALaZ
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) January 21, 2025
నెట్టింట బెస్ట్ విషెస్
ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ పోస్టులో కిరణ్ రహస్య ఫొటోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పేరెంట్స్ కాబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హ్యాపీగా ఉండండి అంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట ట్రెండ్ అవుతోంది.
సినిమా.. స్నేహం.. ప్రేమ.. పెళ్లి
ఇక కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రాజావారు రాణిగారు సినిమాతో ఈ జంట తొలిసారిగా కలిసింది. ఆ సినిమా సమయంలో వీళ్ల మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. అయితే మొదట్లో వీరు లవ్ లో ఉన్నట్లు పుకార్లు వచ్చినా క్రమంగా అవి చల్లబడ్డాయి. కానీ అకస్మాత్తుగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుని ఫొటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకే వీరి వివాహం జరిగింది.
Actor @Kiran_Abbavaram & #RahasyaGorak to become proud parents very soon ❤️ pic.twitter.com/mv5FgJmobI
— At Theatres (@AtTheatres) January 21, 2025







