Andhra Pradesh: వైజాగ్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఏకంగా 25 ఎకరాల్లో నిర్మాణం!

ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్‌ అభిమానులకు శుభవార్త. విశాఖపట్నంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోంది. వైజాగ్ లో కొత్త స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. 25 ఎకరాల్లో స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను నిర్మిస్తారు. ఇక ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వివిధ రకాల ఆటల నిర్వహణకు ఆతిథ్యం ఇవ్వనుంది.

రాబోయే 3–4 నెలల్లో కొత్త స్టేడియానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. వైజాగ్ లో ఇప్పటికే వైఎస్ ఆర్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇది దేశవాళీ మ్యాచ్ లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్ లకూ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పుడు కొత్త స్టేడియం ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు? నిర్మాణ వ్యయం ఎంత? అనేదానిపై వివరాలు తెలియాల్సి ఉంది.

స్టేడియంతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం
శంకుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్
నగరంలో ఇప్పటికే ఉన్న ఓ అంతర్జాతీయ స్టేడియం

విశాఖలో ఈ నెల 16 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులకు అపుడే ఫీవర్ స్టార్ట్ అయింది. రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ విశాఖ కేంద్రంగా ఎక్కువ జరిగేలా చేసేందుకు కొత్తగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉపయోగపడుతుంది అని అంటున్నారు.

  • Related Posts

    IPL2025: తొలి మ్యాచ్‌లో KKR vs RCB.. ఐపీఎల్ షెడ్యూల్ ఇదేనా?

    క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూసే IPL18వ‌ సీజ‌న్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్లు వారి హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఈ సీజ‌న్ తొలి…

    CT2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?

    మరో 5 రోజుల్లో మినీ వరల్డ్ కప్‌గా భావించే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్(Pakistan), UAE వేదికగా ఈ మినీ సంగ్రామం మొదలు కానుంది. మార్చి 9న ఫైనల్ జరుగుతుంది. కాగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *