AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Sessions) రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్(Governor Justice Abdul Nazeer) ప్రసంగించారు. YCP సభ్యుల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగం కొనసాగింది. కాసేపు నిరసన కార్యక్రాన్ని చేపట్టిన వైసీపీ సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం కొనసాగింది. ప్రసంగం ముగిసిన తర్వాత సీఎం చంద్రబాబు(CM Chandrababu), అసెంబ్లీ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ గవర్నర్‌ను వాహనం వరకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన బీఏసీ మీటింగ్

కాగా అనర్హత వేటు(Disqualification) తప్పించుకునేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్‌(YS Jagan) బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన 11 నిమిషాలకే YCP సభ్యులతో కలిసి బయటకు వచ్చేశారు. పైగా ఉన్న కొద్దిసేపు గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకుని, సభలో గందరగోళం సృష్టించేందుకు యత్నించారు. సభలో వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా సభ వాయిదా పడిన వెంటనే CM చంద్రబాబు అధ్యక్షతన బీఏసీ(Business Advisory Committee) సమావేశం ప్రారంభమయింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అజెండాను నిర్ణయించనున్నారు. రేపు సభలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 ప్రవేశపెట్టనున్నారు.

AP BAC decides to hold Assembly meetings till July 26

Related Posts

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజులూ జోరు వర్షాలు: IMD

తెలుగు రాష్ట్రాలను వర్షాలు(Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోని నదులు, చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ(Department of Meteorology) మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర…

APL-2025: తుంగభద్ర వారియర్స్‌దే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టైటిల్

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL -2025) విజేతగా తుంగభద్ర వారియర్స్(Tungabhadra Warriors) నిలిచింది. విశాఖపట్నంలోని డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ACA-VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్(Final) మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్ అమరావతి రాయల్స్‌(Amaravati Royals)ను 5 వికెట్ల తేడాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *