ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో తొక్కిసలాట(Stampede) జరిగి 17మందికిపైగా మరణించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన కారణంగా సంగం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. సంఘటన జరిగిన వెంటనే డజన్ల కొద్దీ అంబులెన్స్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. చనిపోయిన భక్తుల మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. గాయపడిన భక్తులను అక్కడ నిర్మించిన కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

పరిస్థితి అదుపు తప్పడంతోనే తొక్కిసలాట
మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా మంగళవారం ఉదయం నుండే మహా కుంభమేళా(Maha Kumbh) వద్ద భక్తులు భారీ సంఖ్యలో గుమిగూడారు. భారీ జనసమూహం చాలా చోట్ల బారికేడ్లను కూడా బద్దలు కొట్టింది. అర్ధరాత్రి తర్వాత, స్నానం చేసేవారి గుంపు సంగం బ్యాంకు దగ్గర ఆగిపోయింది.. దీని కారణంగా పరిస్థితి మరింత దిగజారింది. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట జరిగింది. పిల్లర్ నంబర్ 157 సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సమాచారం ఫెయిర్ కంట్రోల్ రూమ్‌కు, పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరగానే అక్కడ కలకలం రేగింది. త్వరితగతిన, పారామిలిటరీ దళాలు, అంబులెన్స్‌లను వివిధ ప్రాంతాల నుండి సంగం వైపు పంపించారు. దీని తరువాత, భక్తులందరినీ అంబులెన్స్‌లో తీసుకువచ్చారు. సెంట్రల్ హాస్పిటల్‌లో చాలా మంది నేలపై పడి ఉన్నారు.. వారు మరణించారని ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ(PM Modi) ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi)కు ఫోన్ చేసి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
13 अखाड़ों का मोनी अमावस्या पर भगदड़ के चलते स्नान रद्द। महाकुंभ पर लगी गिद्धों की नज़र।
ईश्वर सभी श्रद्धालुओं की रक्षा करे।@MahaKumbh_2025 #MauniAmavasya #MahaKumbhOnDD #MahaKumbh2025 #MahakumbhCalling #MahaKumb_2025 #महाकुंभ #महाकुंभ2025 #एकता_का_महाकुंभ pic.twitter.com/ZMvTZD7adz
— Prabhashkar Saxena (@Prabhashka74054) January 29, 2025








