మన ఈనాడు:
భారతీయుడు–2 సినిమా ఆగిపోయిందనే వస్తున్న వార్తల్లో నిజం లేదని దర్శకుడు శంకర్ కొట్టిపారేశారు. మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించారు. 27ఏళ్ల తర్వాత కమల్(KAMAL HASAN), క్రేజీ డైరక్డర్ శంకర్ (SHANKER) కాంబినేషన్లో భారతీయుడు–2 సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
స్వాతంత్య్రానికి ముందే జరిగిన వాస్తవ కథతో సినిమా ఉండబోతుందని డైరక్టర్ శంకర్ చెప్తూ వస్తున్నారు. కమల్ సరసన కాజల్ అగర్వాల్, ఐశ్వర్యరాజేష్‌లు నటించనున్నారు. ఈసినిమాలో వివేక్ పాత్ర హైలెట్‌గా నిలవబోతుందని సినిమా వర్గాలు పేర్కొంటున్నాయి. రవి వర్మన్ సినిమాటోగ్రాఫర్ చిత్రీకరణలో కొత్తదనం చూపించబోతున్నారని తెలుస్తుంది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ సంగీతంతో మరోట్రెండ్ సృష్టించబోతున్నట్ల భారతీయుడు–2 సినిమా టీమ్ వెల్లడిస్తుంది.
అవినీతిపై పోరాటం సాగించే సినిమా భారతీయుడు అప్పట్లో ప్రజల మనస్సు గెలుచుకోంది. సామన్యుడు ఒక్కరోజు సీఎంగా ఉండి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చూపించారు. తాజాగా ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో డబ్బు ప్రాధాన్యతతోపాటు అవినీతి ప్రభుత్వాలగా మారుతున్నాయి. ఈనేపథ్యంలో శంకర్, కమల్‌హాసన్ మూవీపై ఆసక్తి నెలకొంది. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేసేందుకు టీమ్ సన్నద్దం చేస్తుంది.