CM Revanth: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం రేవంత్.. క్యాబినెట్ విస్తరణపై చర్చ

తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth) ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తూనే అటు కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీకి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు పార్టీ ఛీఫ్ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశంకానున్నారు. అలాగే విదేశాంగ మంత్రి జైశంకర్‌(External Affairs Minister Jaishankar)తో రేవంత్ భేటీ అవుతారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case) విషయం చర్చించేందుకు ఆయనతో CM చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా వారిని ఎలాగైనా స్వదేశానికి రప్పించి, శిక్ష పడేటట్లు చేయాలని కోరనున్నారు. మరోవైపు మంత్రి వర్గ విస్తరణ(Cabinet expansion)పై పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

రేసులో విజయశాంతి, అద్దంకి

కొత్తగా జరిగే మంత్రివర్గ విస్తరణలో కొత్తగా ఆరుగురికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి(MLC Vijayashanti)తో పాటు అద్దంకి దయాకర్(Addanki Dayakar) కూడా మంత్రి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అద్దంకి దయాకర్‌కు మంత్రి పదవి వరిస్తే.. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌కు చెక్ పడినట్టే. ఒకవేళ మాల వర్గానికి సంబంధించి వారికి మంత్రి వర్గంలో తీసుకుంటే వీళ్లిద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే మంత్రి పదవి వరించే అవకాశం ఉంది.

ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్ ! - Telugu 360 te

మొత్తం 18 మందికే ఛాన్స్

మరోవైపు మక్తల్ MLA వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) కూడా ఈ సారి మంత్రి కావాలని ట్రై చేస్తున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి అన్న వెంకట్ రెడ్డి మంత్రిగా ఉండటంతో ఈయనకు క్యాబినేట్‌లో చోటు దక్కడం డౌటే అని చెబుతున్నారు. TGలో మొత్తంగా 18 మందికి ఛాన్స్ ఉంది. ఇప్పటికే మంత్రి వర్గంలో CMతో కలిపి దాదాపు నలుగురు రెడ్లు ఉన్నారు. ఈసారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. అందులో ఒకటి కొత్తగా ఎన్నికైన MLCకి ఇచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Related Posts

Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…

Assembly Seats: త్వరలో ఏపీ, తెలంగాణలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు!

రాష్ట్రాల అసెంబ్లీ స్థానల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాలు (Telangana Assembly Seats) పెరగవచ్చని తెలుస్తోంది. ఏపీలో 50 (AP Assembly Seats), తెలంగాణ(Telangana)లో 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *