Mahakumbha Mela: కిక్కిరిసన ప్రయాగ్‌రాజ్.. కుంభమేళాలో జనకోలాహలం

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbhamela) పెద్దయెత్తున కొనసాగుతోంది. 12 ఏళ్లు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాకు లక్షలాదిగా భక్తజనులు తరలివస్తున్నారు. త్రివేణీ సంగమం(Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో ప్రయాగ్‌రాజ్ భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ముఖ్యంగా మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) పండుగ కావడంతో భారీ సంఖ్యలో అఘోరాలు(Aghoras), అఖాడాలు(Akhadas), నాగసాధువుల(Nagasadhus)తోపాటు సాధారణ భక్తులు, విదేశీయులు భారీగా తరలివచ్చారు. దీంతో నిన్న త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేసిన భక్తుల సంఖ్య దాదాపు 3 కోట్లకుపైనేనని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. తొలిరోజు కోటిన్నర మంది వస్తే.. రెండో రోజు రెండింతలకు మించి వచ్చారని తెలిపారు.

40వేల కోట్ల మంది వస్తారని అంచనా

కాగా ప్రంపచంలోనే ఇది అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక(The biggest spiritual celebration) కావడం విశేషం. 45రోజుల పాటు సాగే మెగా మహా కుంభమేళా 40వేల కోట్ల మేర జనభా వస్తారని అంచనా వేస్తోంది. ఇక ఈ కుంభమేళాకు విదేశీ భక్తులు(Foreign devotees) కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే UP ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. మహా కుంభమేళాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం(Huge Income) వస్తోందని అంచనా వేస్తున్నారు. తక్కువలో తక్కువ రూ. 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని ఆశిస్తున్నారు. అటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఆదాయం

ఈ మహా కుంభమేళా ద్వారా UP ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రతి భక్తుడు సగటున రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు చేస్తాడని భావిస్తున్నారు. ఇది రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టవచ్చని ట్రేడ్ నిపుణులు(Trade professionals) చెబుతున్నారు. కొన్ని వర్గాల అంచనా ప్రకారం, ఈ మొత్తం ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా రూ.7000 కోట్లతో UP సీఎం యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాట్లకు కేటాయించిన సంగతి తెలిసిందే.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *