చలి రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చలికి గజగజ వణుకుతున్నారు. శీతాకాలంలో( Winter season)ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. చాలా మంది పండ్లను తినడం పక్కన బెడతారు. చలికాలంలో ఫ్రూట్స్ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా పండే పంటల్లో స్ట్రాబరీస్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కడ చూసిన ప్రెష్ స్ట్రాబెర్రీస్ కనిపిస్తున్నాయి. ఈ రెడ్ కలర్ ఫ్రూట్ ఎంత అందంగా ఉంటుందో..దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అంతే దండిగా ఉంటాయి. స్ట్రాబెర్రీ పండు సెల్ డ్యామేజ్‌ను నివారించడంలో సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీతో చర్మంపై దద్దుర్లు మాయం
స్ట్రాబెర్రీలోని వివిధ పదార్థాలు చర్మంపై దద్దుర్లు, అలర్జీలు, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీ (strawberries) పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ పండు తినడం వల్ల మన మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది మెదడును అలర్ట్ గా,యాక్టివ్ గా,షార్ప్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ పండును తినవచ్చు. అకస్మాత్తుగా రక్తంలో చక్కెర పెరుగుదల సమస్యను నివారిస్తాయి.
ఈ పండ్లు ట్రై చేయండి
అరటి , (bananas) బొప్పాయి (papaya) చలికాలంలో బద్ధకం పోయి.. తక్షణ శక్తి కావాలంటే, అరటి పండు, బొప్పాయి మంచి ఎంపిక. ఈ రెండు పండ్లు సులభంగా జీర్ణమై శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. చలికాలంలో నారింజ పండ్లను (oranges) తినడం వల్ల బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శీతాకాలంలో ఇన్ఫెక్షన్, జలుబు వైరల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బత్తాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి విటమిన్ డి మంచి పరిమాణంలో లభిస్తాయి. అందువల్ల, చలి రోజుల్లో ఈ పండును ఆహారంలో చేర్చుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బత్తాయి తినడం ద్వారా, మీరు అనేక గుండె జబ్బుల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవచ్చు. జామపండు (guava) తింటే జలుబు తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. జామపండు విటమిన్లు సి, ఎ, ఇ, ఫైబర్, ఐరన్, కాల్షియం, మాంగనీస్ అనేక ఇతర ఖనిజాల నిల్వగా ఉంది. రోజూ ఒక జామపండు తీసుకుంటే. కాబట్టి ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఈ పండు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చలికాలంలో ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అటువంటి పరిస్థితిలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, ఈ పండును మీ ఆహారంలో చేర్చాలి. ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్‌లో ఐరన్ (iron), కాల్షియం (calcium), పొటాషియం ( potassium) ఫాస్పరస్ మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.








