GOVT JOBS: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో కొలువుల జాతర!

రాష్ట్రంలోని నిరుద్యోగుల(Unemployees)కు తెలంగాణ సర్కార్(Telangana Govt) శుభవార్త చెప్పింది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల(Posts)ను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అన్నిశాఖల్లో నియామకాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం, ఉగాది(Ugadi Festival) తర్వాత వారం లేదా పది రోజుల్లో 55,418 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు(Notifications) విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సీఎం రేవంత్(CM Revanth) సర్కార్ ఇప్పటివరకు 58,868 పోస్టులను భర్తీ చేయడంతోపాటు తాజాగా పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలతో కలిపి 57,924 పోస్టులను పూర్తి చేసింది.

good news telangana cm revanth reddy announces 60000 government jobs  recruitment this year

ఆ పోస్టుల భర్తీకి ప్లాన్

రాబోయే నోటిఫికేషన్లలో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల(Compassionate appointments)ను కూడా చేర్చి భర్తీ చేయాలని సర్కారు ప్లాన్ చేస్తోంది. మహిళా, శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్‌వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ(Revenue) శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారి (GPO) పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు రానున్నాయి. వీటితో పాటు 14,236 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. అదనంగా 228 పోస్టుల భర్తీకి కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది. గ్రూప్-1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలో నియామక పత్రాలు ఇవ్వనున్నారు. 15 నెలల్లో 61,579 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ప్రజలకు చూపించాలని రేవంత్ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana Increases TSPSC Group-1 Posts and Prepares for New Notification!  | Sakshi Education

త్వరలో శాఖలవారీగా నోటిఫికేషన్లు

జాబ్ క్యాలెండర్(Job Calander) ప్రకారం, 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసి భర్తీ చేస్తే, మొత్తం 1.16 లక్షల ఉద్యోగాల ప్రక్రియ పూర్తవుతుంది. క్యాబినెట్ నిర్ణయం మేరకు GPO పేరుతో 10,954 పోస్టుల భర్తీకి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో VROలుగా పనిచేసి, ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న 6,000 మందిని GPOలుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అదనంగా 4,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయి. స్కిల్ యూనివర్సిటీ(Skill University), హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్ ఇన్‌స్టిట్యూట్‌లలో అవసరమైన పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థిక, న్యాయ శాఖలు, సచివాలయం, సమీకృత గురుకులాల్లో సుమారు 30,228 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆర్థిక శాఖతో చర్చలు జరిపిన అధికారులు, త్వరలో శాఖలవారీగా నోటిఫికేషన్లు(Department-wise notifications) జారీ చేయనున్నారు.

Cm Revanth Reddy 10 Points

Related Posts

Rains: వరుణుడు ఉప్పెనై.. వీధులు ఏరులై.. తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టిన వర్షం

తెలుగు రాష్ట్రాల్లో వానలు(Rains) దంచికొడుతున్నాయి. మరో ఐదు రోజులు రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(Heavy Rains) పడతాయని వాతావరణశాఖ(IMD) తెలిపింది. ఇదిలా ఉండగా నిన్న మధ్య తెలంగాణ(Telangana) జిల్లాలు వరుణుడి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమైన…

Weather Alert: తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు: IMD

తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ(IMD) వెదర్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం (ఏప్రిల్ 22) హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం(Rains) కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భాగ్యనగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *