ND vs NZ: భారత్‌కు తప్పని భంగపాటు.. తొలిటెస్టు‌లో న్యూజిలాండ్ ఘనవిజయం

Mana Enadu: బెంగళూరు టెస్టు(Bangalore Test)లో భారత్‌కు భంగపాటు తప్పలేదు. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా(Team India)పై కివీస్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఇవాళ ఐదోరోజు బ్యాటింగ్ చేసిన ఆ జట్టుకు భారత పేస్ గన్ బుమ్రా(Bumrah) ఆదిలోనే షాకిచ్చాడు. న్యూజిలాండ్(New Zealand) కెప్టెన్ టామ్ లాథమ్‌(0)ను ఇన్ స్వింగర్‌తో ఎల్బీగా పెవిలియన్ పంపించాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (17) పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. అయితే కివీస్ బ్యాటర్లు విల్ యంగ్(45), రచిన్ రవీంద్ర(39) మరో వికెట్ పడకుండా లాంఛనం పూర్తి చేశారు. కాగా 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ గెలవడం విశేషం. చివరగా ఆజట్టు భారత గడ్డపై 1988లో నెగ్గింది.

 తొలి ఇన్నింగ్సే కొంపముంచింది..

ఈ టెస్ట్‌లో టాస్‌(Toss) గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర (134), కాన్వే (91), సౌథీ(65) పరుగులు సాధించడంతో 402 భారీ స్కోరు సాధించింది. దీంతో భారత్‌కు సెకండ్ ఇన్నింగ్స్‌(Second innings)లో భారీ లీడ్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ దీటుగానే ఆడినా కివీస్ తగినంత టార్గెట్ ఇవ్వలేకపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్(Sarfraj Khan) (150), పంత్(99), కోహ్లీ (70), రోహిత్ (52) రన్స్ చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో విలయం, హెన్రీ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, అజాజ్ పటేల్ రెండు వికెట్లు తీశాడు. ఈ విజయంతో న్యూజిలాండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కాగా రెండో టెస్టు ఈనెల 24 నుంచి పుణే(PUNE)లో జరగనుంది.

Share post:

లేటెస్ట్