Women’s T20 World Cup 2024: న్యూజిలాండ్‌దే ఉమెన్స్ టీ20 ప్రపంచకప్.. ఫైనల్లో సౌతాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ

Mana Enadu: ఎట్టకేలకు న్యూజిలాండ్(New Zealand) సాధించింది. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌(Women’s T20 World Cup)లో ఆ జట్టు కొత్త ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ మెన్స్ టీమ్ కూడా సాధించలేని ఘనతను కివీస్ మహిళలు సాధించారు. న్యూజిలాండ్ మహిళల జట్టు 2024 టీ20 వరల్డ్​కప్ ఛాంపియన్స్​(New Champions)గా నిలిచింది. దుబాయ్ వేదికగా ఆదివారం సౌతాఫ్రికా(South Africa)తో జరిగిన ఫైనల్ పోరులో కీవీస్ 32 పరుగుల తేడాతో నెగ్గింది. ఫలితంగా తొలిసారి ప్రపంచకప్ టైటిల్​ను ముద్దాడింది. 159 పరుగుల టార్గెట్(Target) ఛేదనలో సఫారీలు 126/9కే పరిమితమయ్యారు. ఆ జట్టులో కెప్టెన్ లారా వోల్వార్ట్‌ (33) మాత్రమే రాణించింది. దీంతో ఈ ఏడాది సఫారీ జట్టు మరో రన్నరప్(Runnerup)​తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కివీస్ బౌలర్లలో అమేలీ కెర్‌, రోస్​మెరీ చెరో 3, కర్సన్, జొనాస్, బ్రూక్ తలో 1 వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అమేలీ కెర్‌(Amelie Kerr) (43), బ్రూకీ (38) సూజీ బేట్స్ (32) రన్స్‌తో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో నొంకులెకొ 2, డిక్లార్క్, అయబొంగ, చొలే తలో వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సఫారీలు ఛేదనలో 20 ఓవర్లలో 126/9 స్కోరుకే పరిమితమయ్యారు. వోల్వార్ట్‌ (33), బ్రిట్స్‌ (17), ట్రయన్‌ (14) మినహా అంతా విఫలమయ్యారు.’Player of the Match’, ‘Player of the Series’ రెండూ కివీస్ ప్లేయర్ అమేలీ కెర్‌కు దక్కాయి.

https://twitter.com/ImArpit_18/status/1848055936310526343

కాగా 2009, 2010 టోర్నీలలో రన్నర్‌పగా నిలిచిన న్యూజిలాండ్‌ ఈసారి మాత్రం ట్రోఫీని దక్కించుకుంది. ఇది 9వ T20 ప్రపంచ కప్‌కాగా.. ఆసీస్‌ 6సార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023), ఇంగ్లండ్‌(2009), వెస్టిండీస్‌ (2016) ఒక్కోసారి విజేతగా నిలిచాయి. తాజాగా ఛాంపియన్స్ లిస్ట్​లోకి న్యూజిలాండ్ (2024) కూడా చేరింది. కాగా న్యూజిలాండ్‌ పురుషులు, మహిళల జట్లు ఒకేరోజు చరిత్రాత్మక విజయాలతో మురిపించాయి. టామ్‌ లాథమ్‌(Tom Latham) సారథ్యంలోని పురుషుల జట్టు 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని అందుకోగా.. సోఫీ డివైన్‌(Sophie Devine) నేతృత్వంలోని మహిళల బృందం ఫైనల్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి తొలిసారి టీ20 ప్రపంచ కప్‌ ఛాంపియన్‌(T20 World Cup Champion)గా అవతరించడం విశేషం.

 

Share post:

లేటెస్ట్