Mana Enadu : మధ్యాహ్నం ఒంటి గంట దాటగానే.. లేదా లంచ్ చేసిన తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంది. ఇక ఆఫీసులో వర్క్ చేసే వారికైతే లంచ్ తర్వాత పని చేయడానికి శరీరం మొండికేస్తుంది. నిద్రొస్తుందంటూ గంటకో రెండు సార్లు టీ, కాఫీలు తాగేస్తుంటారు. అబ్బా.. ఈ టైంలో ఇంట్లో ఉంటే హాయిగా నిద్రపోయే వాళ్లం అని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా పగటి పూట ఇలాగే ఫీల్ అవుతుంటారా..? ఎప్పుడెప్పుడు నిద్ర పోదామా అని మీకూ అనిపిస్తోందా? అయితే అలర్ట్ కావాల్సిందేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే..?
వారికి MCR వ్యాధి వచ్చే అవకాశం
వృద్ధుల్లో పగటి పూట నిద్ర రావడం, ఇతర నిద్ర సమస్యలు ఎదుర్కోవడంలో జ్ఞాపశక్తికి సంబంధించి motoric cognitive risk syndrome (MCR) వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ప్రచురించింది. నిద్ర సమస్య లేని వారితో పోలిస్తే పగటి పూట ఎక్కువగా నిద్ర రావడం, యాక్టివ్ గా లేని వారిలో ఈ వ్యాధి పెరిగినట్లు జర్నల్ లో వెల్లడైంది.
445 మందిపై అధ్యయనం
సుమారు 76 ఏళ్ల వయసు గల 445 మందిపై ప్రత్యేక ప్రశ్నలతో ఈ పరిశోధన చేపట్టగా.. నిద్రపోయే సమయంలో తలెత్తిన ఇబ్బందులు? రాత్రి పూట ఎన్ని సార్లు నిద్ర (Night Sleep) లేచారు? నిద్రపోవడానికి ఏవైనా మందులు వాడారా? వంటి విషయాలపై సర్వే చేశారు. కొందరు పగటిపూట నిద్ర వచ్చిందని.. మరికొందరు తినేటప్పడు, డ్రైవింగ్ చేసే సమయంలోనూ నిద్రొస్తుందని చెప్పారు.
వారికి MCR ముప్పు
ఈ పరిశోధన మొదట్లో సుమారు 42 మంది MCR అనే జ్ఞాపకశక్తి (Memory)కి సంబంధించిన వ్యాధి రాగా.. మరో 36 మందికి మధ్యలో వచ్చినట్లు పరిశోధనలో తేలింది. పగటిపూట ఎక్కువగా నిద్ర వచ్చి చురుకుగా లేని వారిలో 35.5శాతం ఈ సమస్య పెరిగినట్లు పరిశోధనలో తేలింది. ఎలాంటి నిద్ర సమస్యలు లేని వారితో పోలిస్తే పగటి పూట నిద్ర వచ్చే వారిలో మూడు రెట్లు Motoric Cognitive Risk Syndrome వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు.






