IIIT Hyderabad: బాబోయ్.. చికెన్ బిర్యానీలో కప్ప.. అవాక్కైన స్టూడెంట్స్

Mana Enadu: బిర్యానీ(Biryani).. అబ్బా ఈ పేరు వింటేనే నోరూరుతుంది. పైగా బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఏ చిన్న స్పెషల్ అకేషన్(Special occasion) వచ్చినా సరే బిర్యానీ తినాల్సిందే. అలాగే ఇంట్లో ఏ చిన్న వేడుక(celebrations) జరిగినా బిర్యానీ లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు బిర్యానీ అంటేనే ఓ ఎమోషన్​(emotion). ఫిష్,​ మటన్​, ప్రాన్స్,​ కుండ బిర్యానీ, దమ్​ బిర్యానీ అంటూ ఏరియాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంచక్కా లాగించేస్తుంటారు. ముఖ్యంగా చికెన్​ బిర్యానీ అంటే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడి తింటుంటారు.

 ఈ మధ్య ఇవి సాధరణమైపోయాయండీ..

సాధారణంగా చికెన్​ బిర్యానీ(Chicken biryani) వండాలంటే చికెన్​తో పాటు లవంగాలు, దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలుతో చేస్తుంటారు. కానీ అవేమీ కాకుండా ఈ మధ్య జెర్రీలు, బల్లులు, బొద్దింకలతో చికెన్​ బిర్యానీలు దర్శనమిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్​(HYD)లోని ఓ రెస్టారెంట్(Restaurant)​లో చికెన్​ బిర్యానీ జెర్రీ వచ్చిందన్న వార్త సోషల్​ మీడియా(Social media)లో హల్​చల్​ చేస్తోంది. ఆ జెర్రీ విషయాన్ని మర్చిపోకముందే, బిర్యానీలో చనిపోయిన కప్ప అంటూ ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

 ఆలస్యంగా వెలుగులోకి

హైదరాబాద్ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ మెస్‌(Hyderabad Gachibowli Triple IT Campus Mess)‌లోని బిర్యానీలో కప్ప(Frog) కనిపించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేసింది. ఈ నెల 16న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థి మెస్‌లో చికెన్ బిర్యానీ తింటుండగా కప్ప దర్శనమివ్వడంతో నివ్వెరపోయారు. దీనిపై క్యాంపస్, ఫుడ్ సేఫ్టీ అధికారుల(Food Safety Officers)కు విద్యార్థులంతా ఫిర్యాదు చేశారు. అయితే ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్టూడెంట్స్ మండిపడుతున్నారు. ఆ ఫొటోను చూస్తే ఏకంగా బిర్యానీతో పాటు వండేసినట్లు తెలుస్తోంది. ఇది సోషల్​ మీడియాలో షేర్​ చేయగా వైరలవుతోంది.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *