
టాలీవుడ్ హీరో, రౌడీబాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) మంచి మనసు చాటుకున్నారు. ఈ రోజు తన పుట్టినరోజు(Birth Day)ను పురస్కరించుకొని ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియా-పాకిస్థాన్(India-Pakistan War Crisis) మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో విజయ్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. దీంతో అతడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ విషయమేంటంటే..
View this post on Instagram
పాకిస్థాన్‌తో మన దేశం కోసం పోరాడుతున్న భారత సైనికుల(Indian soldiers)కు తన “RWDY” షోరూమ్ కలెక్షన్ల నుంచి కొంత మొత్తాన్ని సాయుధ దళాల(armed forces)కు విరాళం(Donation)గా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. మనకు అన్నీ ఇచ్చిన దేశానికి ఇలాంటి సమయంలో మనం ఎంతోకొంత తిరిగి ఇవ్వడం మన బాధ్యత అని విజయ్ ఈ సందర్భంగా వీడియో రిలీజ్ చేశాడు. అంతేకాదు తన బర్త్ డే పేరిట తెలుగు రాష్ట్రాల్లోని 9 నగరాల్లో 9 దేవరకొండ బర్త్‌డే ట్రక్కు(Deverakonda’s birthday truck) నడిపిస్తున్నట్లు.. ఎవరైనా దీనిని చూసి దాని దగ్గరకు వెళితే ఉచితం ఐస్ క్రీం తీసుకోవచ్చని తెలిపాడు.