మన ఈనాడు: తెలంగాణలో ఐటీ అధికారులు దూకుడు పెంచారు. నిన్నటి వరకు వరుసగా కాంగ్రెస్ నేతలపై మాత్రమే ఐటి అధికారులు సోదాలు జరిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఐటి దాడులతో రాజకీయ నేతల్లో అలజడి రేపుతుంది. ఈక్రమంలో బీఆర్ఎస్నే బీజీపీ తో ఐటి బాణం వదిలందనే ఆరోపణలు వినిపించాయి.
తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన కీలకమంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు జరుగుతున్నాయి.
తెలంగాణలో ఐటీ దూకుడు చూపిస్తోంది. తాజాగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆమె బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని సబితా సమీప బంధువు ప్రదీప్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రముఖ ఫార్మా కంపెనీల్లోనూ, ఫార్మా కంపెనీ చైర్మన్, సీఈవో, డైరెక్టర్, సిబ్బంది ఇళ్లలోను సోదాలు జరుగుతున్నాయి. నగరవ్యాప్తంగా ఏకకాలంలో 15చోట్ల ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయి.