మన ఈనాడు: AP హైకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై మరోసారి విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్‌పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు బయట ఉన్నారు. నవంబర్ 28 న మధ్యంతర బెయిల్ ముగుస్తుంది. ఇక ఇవాళ హైకోర్టులో ఇదే కేసుకు సంబంధించి, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై మరోసారి విచారణ జరగనుంది.
AP హైకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే ఈ కేసులో మెడికల్ గ్రౌండ్స్‌పై నాలుగు వారాల మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబు బయట ఉన్నారు. నవంబర్ 28 న మధ్యంతర బెయిల్ ముగుస్తుంది. ఇక ఇవాళ హైకోర్టులో ఇదే కేసుకు సంబంధించి, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై మరోసారి విచారణ జరగాల్సి ఉంది. అ కేసు విచారణనను ఈనెల 15కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది ఏపీ హైకోర్టు.
గత విచారణలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రబాబు రాజకీయ ర్యాలీలు చేయకూడదు. కేసుకు సంబంధించి ఎక్కడా మాట్లాడకూడదు. అయితే కంటి శస్త్ర చికిత్స, ఇతర మెడికల్ గ్రౌండ్స్‌పై ఇచ్చిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ గడువు మారో 18 రోజుల్లో ముగుస్తుంది. నవంబర్ 28 వ తేదీ సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబూ మళ్ళీ లొంగిపోవాల్సి ఉంటుంది. ఈలోపు ఒకవేళ రెగ్యులర్ బెయిల్ వచ్చిన సుప్రీం కోర్ట్‌లో క్వాష్ అయిన ఈ కేసు లొ బాబుకు పూర్తిగా ఊరట లభించినట్లే అవుతుంది. దాంతో సుప్రీమ్ కోర్టు లో క్వాష్ పిటిషన్ పై హై కోర్ట్‌లో రెగ్యులర్ బెయిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఈ ఏడాది సెప్టంబర్ తొమ్మిదో తేదీన చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. 53 రోజులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అప్పటి నుండి కింద కోర్టుల నుండి పై కోర్టుల వరకు ఈ కేసులో విచారణ జరుగుతూనే ఉంది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న చంద్రబాబు, కంటి ఆపరేషన్ చేపించుకున్నారు. మళ్ళీ ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్‌పై విచారణ నేపథ్యంలో అటు టీడీపీ కార్యకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
గత విచారణలో మెరిట్స్‌లోకి వెళ్ళని హై కోర్ట్, కేవలం మెడికల్ గ్రౌండ్స్ పై మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు విచారణలో మెరిట్స్‌పై విచారణ జరుగుతుందా లేదా క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ వాయిదా పడుతుందా అనేది ఆసక్తిగా మారింది. అనుకున్నట్టుగా విచారణను ఈనెల 15కి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. గత విచారణలో స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై వాదనలు సుధీర్ఘంగా జరిగాయి. ఈ కేసులో మరింత ఆధారాలు సేకరించాల్సి ఉందని సీఐడీ తరుపు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారని బెయిల్ ఇవ్వొదంటు కోరారు.
మరో వైపు చంద్రబాబు తరుపు న్యాయవాదులు 2021 నుండి బాబుపై చేస్తున్నా ఆరోపణల్లో ఏలాంటి ఆధారాలు చూపించలేదంటూ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు చాలామందిని ఎగ్జామిన్ చేశారని, ఆధారాలు సేకరించారని, ఇంకేం గ్రౌండ్స్ విచారించాలి అంటూ వాదనలు వినిపించారు. 40 రోజులకు పైగా ఏ ఆధారాలు లేకుండానే చంద్రబాబును రిమాండ్ ఖైదీగా ఉంచారని బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును కోరారు.