ఖమ్మం: తెలంగాణలో ఖమ్మం జిల్లా రాజకీయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడి రాజకీయ నేతలతో పాటు ఓటర్లు విభిన్నమైన తీర్పు ఇచ్చే చైతన్యవంతులు. ఈక్రమంలో పాలేరు అసెంబ్లీ సీటుపై ప్రముఖ నేతలంతా కన్నేశారు. ఇక్కడ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ‘చేతి’ గుర్తుపై గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావుపై 7669 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత కందాల హస్తం వీడి కారు గూటికి చేరారు.
ప్రముఖలంతా..పాలేరు నుంచే:
అధికారపార్టీని వీడి కాంగ్రెస్ చేరిన తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరూ పాలేరు అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. అంతేగాకుండా వైఎస్సాఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ స్థాపించిన వైఎస్ షర్మిల సైతం పాలేరుపైనే ఆశలు పెట్టకున్నారు. వీరితోపాటు సీపీఎం పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సైతం పాలేరు బరిలో నిలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
బీఆర్ఎస్ దూకుడు..అభ్యర్థుల ప్రకటనలో ప్రతిపక్షాలు కుస్తీ
అధికారపార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించే ప్రచారంలో దూకుడు మీద ఉంది. ప్రతిపక్షాలు మాత్రం ఇద్దరేసి అభ్యర్ధులు పోటీపడుతూ కుస్తీ పడుతున్నారు. అధికారపార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి గెలుపు అస్ర్తంగా వాడుకుంటున్నారు. మరోసారి పాలేరులో కారు స్పీడ్ పెంచి ప్రతిపక్షాల అభ్యర్ధులను డిపాజిట్లు దక్కినివ్వమంటూ దూసుకపోతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదిస్థానాల్లో ‘హస్తం’ హవానే చూపిస్తామని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు. కారు అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వమంటూ పొంగులేటి శపథం అయితే చేశారు..కానీ మూడు గ్రూపులతో ఎవరు ఏస్థానాల్లో పోటీ చేయాలో తేల్చుకోలేని స్థితిలో సందిగ్ధం ఉన్నారు. వైఎస్సార్టీపీ కాంగ్రెస్‌లో వీలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ షర్మిల పాలేరు సీటుపై మెలిక పెట్టడం పట్ల వీలీన ప్రక్రియ పెండింగ్‌లోనే పడింది. ఆమె పాలేరు బరిలో ఉంటారా..? పార్టీ ఇచ్చే పదవులతో ఆగిపోతారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
మధిరలో నువ్వా..నేనా..?
కాంగ్రెస్ నుంచి మూడుసార్లు గెలిచిన భట్టి విక్రమార్కకు గట్టిపోటీనే ఎదుర్కొవల్సి వస్తుంది. గతంలో సీపీఎం నుంచి పోటీ చేసి ఒడిన లింగాల కమల్‌రాజు ఈసారి కారు గుర్తుపై పోటీ చేసేందుకు బరిలో నిలిచారు. ఇప్పటికే ఖమ్మం జడ్సీ ఛైర్మన్ ఉన్న లింగాల కమల్‌రాజు మధిర నియోజకవర్గంలో క్యాడర్‌ను బలపరిచారు. వీటితో పాటు మొదటి నుంచి కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిన అనుభవం..సానుభూతి రెండు అంశాలు కలిసొచ్చే అవకాశం ఉంది. అంతేగాకుండా ఎర్రుపాలెం, మధిర, ముదిగోండ మండలాలకు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన నాయకులు భట్టి పట్ల విముఖత చూపిస్తున్నట్లు సమాచారం