ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి ఢిల్లీ పర్యటనలో ప్రధానితోపాటు, కేంద్ర హౌంమంత్రి అపాయింట్మెంట్ ఇంకా ఖరారు కాలేదని సమాచారం. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజకీయ సమీకరణలు క్షణ క్షణానికి మారుతున్నాయి. చంద్రబాబు అరెస్టుతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగానే మద్దుతు తెలపడంతోపాటు తెలుగుదేశం పార్టీతో కలిసి బరిలో నిలవబోతున్నాని ప్రకటించారు. మరోవైపు చంద్రబాబును అక్రమంగా వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ప్రజలు నుంచి నిరసనలు పెరుగుతున్నాయి. దీంతో భాజపా ఆచితూచి అడుగేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి సైతం బాబు అరెస్టును తప్పుపట్టడంతో కేంద్ర సర్కారు జగన్ తో దోస్తీ విషయంలో పునరాలోచనలో పడినట్లు సమాచారం.
నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు అరెస్టుపై కేంద్రంలోని పెద్దలను కలవబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీ సీఎం జగన్‌కి అపాయింట్మెంట్ ఇంకా క్లారిటీ ఇవ్వకపోవడానికి నారా కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
25పార్లమెంట్ స్థానాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగిన 13నుంచి 15స్థానాల్లో టిడిపి విజయం సాధించబోతుందని కేంద్ర నిఘావర్గాలు సమాచారం ఇచ్చినట్లుగా విశ్వసనీయవర్గాల సమాచారం. టిడిపి, జనసేన పొత్తుతో అక్కడ వైసీపీ బలంపై స్పష్టతకు వచ్చిన కేంద్రంలోని పెద్దలు సీఎం జగన్ అపాయింట్మెంట్కు నిరాకరిస్తున్నట్లు తెలిసింది.
నందమూరి కుటుంబానికి చెందిన దగ్గుబాటి పురేందశ్వరి సైతం ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టారు. అక్కడ బీజీపీ,టిడిపి, జనసేన ఉమ్మడిగా పనిచేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఏది ఏమైనా రేపు మధ్యాహానికి అటు జగన్, ఇటు నారా ప్యామిలీ పీఎం మీటింగ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.