మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన చేసేందుకు సిద్దం అయ్యారు. ఈక్రమంలోనే హైట్క్సీటీ సైబర్ టవర్స్ వద్ద పోలీసులు ముందుస్తుగా అరెస్టు చేశారు. చంద్రబాబు మద్దతుగా వస్తున్న ఐటీ ఉద్యోగులను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో హైటెక్ సీటీ రహదారులు అన్నీ ఐటీ ఉద్యోగులతో కిక్కిరిసిపోయింది. స్కిల్ డవలప్మెంట్ స్కామ్‌లో వందల కోట్లు కోట్టేశారని అభియోగాలతో వైసీపీ సర్కారు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని రెండు రోజులుగా ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
సైబర్టవర్స్ వద్దకు పెద్ద సంఖ్యలో ఐటి ఉద్యోగులు చేరుకున్నారు. హైదరాబాద్ పోలీసు బలగాలు మోహరించి ఐటీ ఉద్యోగులను చెదరగోడుతున్నారు. తోపులాటలో మహిళా కానిస్టేబుల్ తలకు బలమైన గాయం అయింది. ఐటి ఉద్యోగులు తక్షణమే ఆఫీస్‌లకు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. కానీ ఐటి ఎంప్లాయిస్ మాత్రం ఆందోళన చేసేది విరమించేది లేదని అక్కడే కుర్చున్నారు.
ఐటీ ఆఫీస్‌ల నుంచి ఉద్యోగులు బయటకు రాకుండా పోలీసులు కంపెనీలు వద్దే అడ్డకుంటున్నారు. మరికొన్ని కంపెనీలకు ఇప్పటికే లాగౌట్ సమయాన్ని పోడగించాలని మౌఖిక ఆదేశాలు సైతం జారీ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో హైటెక్ సీటీలో ఐటి ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు తీవ్రం అవుతున్నాయి.