ManaEnadu:లేడీ కొరియోగ్రాఫర్‌పై రేప్ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. మొన్ననే కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఆయన ఈరోజు ఇంటికి వెళ్లిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. 37 రోజుల తర్వాత తండ్రిని మిస్సయిన ఆ పిల్లలు నాన్న ఇంటి ముందుకు రావడంతో ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయారు. నాన్న వచ్చేశావా అంటూ బోరున ఏడ్చారు. జానీ సైతం పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాళ్లకు ముద్దులిస్తూ ఎమోషన్ అయ్యాడు.
View this post on Instagram
ఇది ఎప్పటికీ నా గుండెను గుచ్చుతూ ఉంటుంది
‘ఈ 37 రోజుల్లో మన జీవితం నుంచి చాలా కోల్పోయాం. నా కుటుంబం, శ్రేయోభిలాషుల ప్రార్థనలు నన్ను ఈరోజు ఇక్కడకు తీసుకొచ్చారు. ఎప్పటికైనా సత్యం గెలుస్తుంది. కానీ ఎప్పటికీ ఓడిపోదు. నా కుటుంబం మొత్తం గడిపిన ఈ దశ ఎప్పటికీ నా గుండెను గుచ్చుతుంది’ అని జానీ ఆ వీడియో కింద రాసుకొచ్చాడు. ఆయన పోస్టుకు ఆట సందీప్, యానీ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్లు సైతం మద్దతుగా కామెంట్స్ చేశారు.
జీరోకి జానీ కెరీర్
ఇదిలా ఉంటే బెయిల్‌పై బయటికైతే వచ్చారు కానీ.. ఆయన కెరీర్ మునుపటిలా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదై అరెస్టు కావడంతో జానీ మాస్టర్‌కు రావాల్సిన నేషనల్ అవార్డు రద్దయిన విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్ల అసోసియేషన్ సైతం ఆయనను పదవి నుంచి తొలగించింది. అటు రాజకీయాల్లోనూ తాను ఎంతగానే అభిమానించే జనసేన అతడిని తాత్కాలికంగా బహిష్కరించింది. అన్నింటికంటే ముఖ్యంగా మోస్ట్ వెయిటెడ్ మూవీ ‘పుష్ప2’ నుంచి జానీని తీసేశారు. ఆ విషయాన్ని నిర్మాత ప్రకటించారు. జానీ స్థానంలో వేరే కొరియోగ్రాఫర్ సెట్టయ్యారని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇది ఈ ఒక్క పుష్పతో ఆగిపోతుందా? అంటే అవునని చెప్పడం కష్టమే. మునుపటిలా ఆయన టాప్ హీరోలు, వరుస సినిమాలతో దూసుకెళ్లే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో, మళ్లీ జీరో నుంచి కెరీర్ మొదలుపెట్టాల్సిన పరిస్థితి తప్పేలా లేదు.