అమెరికా(USA)లోని అలాస్కా(Alaska) తీరంలో బుధవారం (జులై 17) తెల్లవారుజామున 7.3 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించింది. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:37 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని కేంద్రం ద్వీప పట్టణం సాండ్ పాయింట్‌కు దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో ఉందని యూఎస్‌జీఎస్ తెలిపింది. భూకంప కేంద్రం 20.1 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా భూకంపం వచ్చినప్పటి దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డుగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
VIDEO: Security camera footage shows shaking inside a home in Sand Point during a magnitude 7.3 #earthquake that triggered #tsunami warnings in #Alaska
— War Diaries (@cool_crusader) July 17, 2025
దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి..
భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరికలు(Tsunami warnings) జారీ చేశారు. సునామీ సంభవించే అవకాశం ఉందని అలాస్కాలోని పామర్‌లోని జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. “దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ (హోమర్‌కు 40 మైళ్లు దక్షిణాన) నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ (ఉనలస్కాకు 80 మైళ్లు NE) వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేశాం” అని కేంద్రం తెలిపింది. కాగా, 1964 మార్చిలో ఈ మారుమూల రాష్ట్రం 9.2 తీవ్రతతో భూకంపం బారిన పడింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు నమోదైన అత్యంత బలమైన భూకంపం, సునామీ ధాటికి 250 మందికి పైగా మరణించారు.






