
మహిళలు, యువతులకు డ్రగ్స్ ఇచ్చి వారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడిన కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి (Mastan Sai)కి రంగారెడ్డి జిల్లా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న అతడిని వారు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు మస్తాన్ సాయిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
అమ్మాయిలకు డ్రగ్స్
ఇక మస్తాన్ సాయి యువతుల వీడియోలు సేకరించిన హార్డ్ డిస్కును రాజ్ తరుణ్ మాజీ లవర్ లావణ్య (Lavanya Case News) పోలీసులకు అందించి, ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. తనకు కూడా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. మస్తాన్ సాయి వద్ద ఉన్న హార్డు డిస్కును తాను తీసుకోవడంతో చంపేస్తానని బెదిరించేవాడని పోలీసులకు తెలిపింది. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను అతను నాశనం చేశాడని ఫిర్యాదులో ఆమె చెప్పింది.
హార్డ్ డిస్కులో విస్తుపోయే వీడియోలు
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు హార్డు డిస్కు (Mastan Sai Hard Disk)ను పరిశీలించగా అందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మస్తాన్ సాయి తరచూ పార్టీ ఇస్తూ.. ఆ పార్టీల్లో అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చేవాడని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత మత్తులో ఉన్న వారిపై అత్యాచారానికి పాల్పడేవాడని, అమ్మాయిల ప్రైవేటు వీడియోలు తీసి వారిని బెదిరించేవాడని విచారణలో తేలినట్లు సమాచారం.
డ్రగ్స్ పార్టీపై ఫోకస్
ఇక పోలీసులు తాజాగా మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ పార్టీ (Mastan Sai Drugs Party)కి సంబంధించిన వీడియోలో ఉన్నవారందరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ డ్రగ్స్ పార్టీ వీడియోల్లో శేఖర్ బాషా, హీరో నిఖిల్ కూడా ఉన్నట్లు సమాచారం.
KCR : ‘తెలంగాణలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తాం’
‘నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్ గా వస్తుంది.’ ఓ సినిమాలో తలైవా రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఇప్పుడు అచ్చం ఇదే డైలాగ్ ను కాస్త అటూ ఇటూగా మార్చి బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…