Israel Bus Blasts: మళ్లీ బాంబులతో దద్దరిల్లిన ఇజ్రాయెల్‌.. 3 బస్సుల్లో పేలుళ్లు

బాంబు పేలుళ్ల(Israel blasts)తో ఇజ్రాయెల్ మరోసారి దద్దరిల్లింది. రాజధాని టెల్ అవివ్‌లో ఆగిఉన్న మూడు బస్సు(Israel bus blasts)ల్లో వరుస పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉగ్రవాద దాడిగా అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటన జరగడంతో ఇజ్రాయెల్ షాక్ అయింది. ఇవే కాకుండా మరో రెండు బస్సుల్లో పేలుడు పదార్థాలు దొరికాయని, కానీ.. అవి పేలలేదని పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. 5 బాంబులు ఒకేలా ఉన్నాయని, వాటికి టైమర్లు అమర్చారని ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు. పేలని బాంబులను బాంబు స్క్వాడ్(Bomb squad) నిర్వీర్యం చేసిందని అన్నారు.

Hopes of end to violence fade as Jerusalem bus bomb injures 21

వెస్ట్ బ్యాంక్‌లో ఆర్మీ ఆపరేషన్‌కు ప్రధాని ఆదేశం

ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం(IPMO) ప్రకటించింది. దీనిపై ప్రధాని బెంజిమన్ నెతన్యాహు(Benjamin Netanyahu) అత్యవసర భద్రతా సమావేశానికి కూడా పిలుపునిచ్చారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో ఆపరేషన్( West Bank military operation) నిర్వహించాలని ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆదేశించారు. ఈ బాంబు దాడులపై షిన్ బెట్ అంతర్గత భద్రతా సంస్థ దర్యాప్తును నిర్వహిస్తోందని, అనుమానితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బాట్ యామ్ మేయర్ బ్రోట్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాగా గత నెల 19న ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం(Ceasefire agreement between Israel and Palestine) కుదిరింది.

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Road Accident: పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌(UP)లోని బులంద్‌శహర్-అలీగఢ్ సరిహద్దు(Bulandshahr-Aligarh border)లో సోమవారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఘోర రోడ్డు(Road Accident) ప్రమాదం జరిగింది. రాజస్థాన్‌లోని జహర్‌పీర్ (గోగాజీ) పుణ్యక్షేత్రానికి యాత్రికులతో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ(Tractor trolley)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *