Bird Flu: కోళ్లకే కాదు.. మనుషులకూ సోకిన బర్డ్‌ఫ్లూ వైరస్!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ ఫ్లూ వైరస్(Bird flu virus) విస్తరిస్తోంది. ముఖ్యంగా APలోని గోదావరి జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకడంతో వేలాది కోళ్లను గుంతలు తవ్వి పూడ్చిపెడుతున్నారు. అటు అధికారులు సైతం పలు చోట్ల రెడ్ అలర్ట్(Alert) జారీ చేశారు. చికెన్(Chicken), కోడిగుడ్లు(Eggs) తినొద్దంటూ సూచిస్తున్నారు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో చికెన్ ధరలు(Chicken Rates) అమాతం పడిపోయాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.100 నుంచి రూ.120కు నిర్వాహకులు అమ్మకాలు నిర్వహిస్తున్న పరిస్థితి గోదావరి జిల్లాలో కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం గోదావరి జిల్లాలో చికెన్ తినాలంటే ప్రజలు భయపడి పోవాల్సిన పరిస్థితులు సైతం ఎదురవుతున్నాయి.

కొన్ని రోజులు చికెన్, గుడ్లు తినొద్దు: అధికారులు

గోదావరి జిల్లాల్లో వైరస్‌తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో(Poultries) తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్‌(positive)గా వచ్చింది. దీంతో మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూంలో 95429 08025 నెంబర్ ఏర్పాటు చేశారు. బర్డ్స్ ఎక్కడ చనిపోతున్నా పశు సంవర్ధక శాఖ అధికారుల(For Animal Husbandry Department officials)కు సమాచారాన్ని అందించాలని హై అలర్ట్ జారీ చేశారు. అయితే ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Chicken Price Hike in AP: 1 Kg of Chicken Rate Rs 260 in Parvathipuram -  Sakshi

ఏలూరు జిల్లా ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ

తాజాగా ఏలూరు జిల్లా(Eluru District)లో మనిషికి కూడా బర్డ్ ఫ్లూ సోకడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. టెస్టుల్లో ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్‌(The person is bird flu positive)గా తేలినట్లు రావడంతో జిల్లా వైద్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. వివరాల ప్రకారం ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలంలో కోళ్ల ఫాంకు దగ్గరలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో, అతడికి టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ పాజిటివ్ తేలింది. ఈ క్రమంలో వైద్యశాఖ అధికారులు అక్కడ మెడికల్ క్యాంపులు(Medical camps) ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. తెలంగాణ(Telangana)లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిని నిపివేశారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *