ManaEnadu: రానా దగ్గుబాటి(Rana Daggubati) ఓ పక్క నటుడిగా చేస్తూనే మరో పక్క హోస్ట్(Host)గా, బిజినెస్‌మెన్‌గా బిజీబిజీగా గడుపుతుంటాడు. ఇదివరకే ‘రానా నంబర్ 1 యారి(Rana Number 1 Yari)’ అనే టాక్ షోతో బుల్లితెర ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా ఆయన మరో కొత్త టాక్ షో(TalkShow)తో ఇంటిల్లిపాదిని అలరించేందుకు సిద్ధమయ్యాడు. రానా హోస్ట్‌గా Amazon Prime OTTలో కొత్త షో మొదలుకానుంది. ఇప్పటికే పలు ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయాయి. తాజాగా దీని గురించి అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ‘ది రానా దగ్గుబాటి షో(The Rana Daggubati Show)’ అనే పేరుతో ఈ కొత్త టాక్ షో వస్తోంది. అమెజాన్ ప్రైమ్ OTTలో ఇది ఈనెల 23 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జై హనుమాన్‌లో రానా?
ఇదిలా ఉండగా ఈ టాక్ షోకి రానానే నిర్మాతగా తన స్పిరిట్ మీడియా(Spirit Media)పై నిర్మించాడు. ఇప్పటికే RGV, రాజమౌళి, పలువురు సెలబ్రిటీలతో ఇంటర్వ్యూలు, షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. మరి ఈ కొత్త టాక్ షో ది రానా దగ్గుబాటి షో ఎలా ఉంటుందో, సినీ సెలబ్రిటీలు ఎన్ని ఆసక్తికర విషయాలు చెప్తారో చూడాలి. ఇక రానా సినిమాల విషయానికొస్తే ఆయన చివరిసారిగా రజినీకాంత్(Rajinikanth) నటించిన వేట్టయన్ చిత్రంలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం జై హనుమాన్(Jai Hanuman)లో నటిస్తారనే ప్రచారం మొదలైంది. తాజాగా రానాతో కలిసి దిగిన ఫొటోను దర్శకుడు ప్రశాంత్ షేర్ చేయడంతో ఈ వార్తలకు ఊతమిచ్చినట్లు అయింది.
తొలి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు
కాగా దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా తొలి సినిమాతోనే పరిశ్రమలో పేరు తెచ్చుకున్నారు. లీడర్(Leader) మూవీ తన నటనకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత రుద్రమదేవి సినిమాలో కీలకపాత్రలో నటించారు. బాహుబలి, బాహుబలి-2 సినిమాలు ఆయనకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆతర్వాత విరాటపర్వం, అరణ్య, భీమ్లానాయక్, 1945 వంటి చిత్రాల్లో రానా నటించారు.
https://twitter.com/PrimeVideoIN/status/1856615494524285211