బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని వారాలుగా అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-8లో మరో వీకెండ్ వచ్చేసింది. శనివారం రోజున గరంగరంగా సాగిన వీకెండ్ ఎపిసోడ్ లో ఆదివారం కూడా ట్విస్టులు ఉండబోతున్నట్టు లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. 12 వారాలుగా అలరిస్తున్న ఈ షోలో ఇప్పటికే పలువురు కంటెస్టంట్లు ఎలిమినేట్ అయ్యారు.
ఊహించని కంటెస్టంట్ ఔట్
బేబక్క, శేఖర్ బాషా, అభయ్, సోనియా ఆకుల, గంగవ్వ, హరితేజ, నవీన్ హౌసు నుంచి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక తాజాగా ఇవాళ (ఆదివారం) ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీజన్ లో మొదటి నుంచి టఫ్ కాంపిటీషన్ ఇస్తూ.. టాప్ 5 కంటెస్టంట్లలో తప్పకుండా ఉంటుంది అనుకుంటున్న ఓ కంటెస్టంట్ ఈ వారం ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మరి ఆ కంటెస్టంట్ ఎవరంటే..
ఆమె హౌసు నుంచి ఎలిమినేట్
ఈ వారం బిగ్ బాస్ హౌసులో నామినేషన్ ప్రక్రియ గత సీజన్ల కంటే కాస్త డిఫరెంటుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వీక్.. హౌసులోకి ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన సభ్యులు వచ్చి కంటెస్టంట్లలో కొందరిని నామినేట్ చేశారు. అలా ఈ వీక్.. నబీల్, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, యష్మీ నామినేషన్లలో ఉన్నారు. అయితే వీరిలో యష్మీ గౌడ డేంజర్ జోనులో ఉండటంతో ఈ వారం హౌజ్ నుంచి ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. యష్మీ ఎలిమినేట్ అయిందన్న వార్త తెలిసి ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీనిపై అధికారిక సమాచారం కావాలంటే ఇవాళ్టి వీకెండ్ ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.