టాలీవుడ్‌లోకి మరో బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu) వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే సుధీర్ బాబు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘జటాధర (Jatadhara)’ అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవలే జరిగింది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..?

జటాధరలో బాలీవుడ్ భామ

సుధీర్ బాబు జటాధర సినిమాలో ఓ బాలీవుడ్ బ్యూటీ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కియారా అడ్వాణీ, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తెలుగు తెరపై ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో మరో భామ చేరబోతున్నట్లు టాక్. కండల వీరుడు సల్మాన్ ఖాన్ దబాంగ్ మూవీతో హిందీ పరిశ్రమకు పరిచయమైన బ్యూటీఫుల్ భామ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) జటాధరలో నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

టాలీవుడ్ లోకి హిందీ బ్యూటీ 

వెటరన్ నటుడు శత్రుఘ్ను సిన్హా కుమార్తె అయిన సోనాక్షి బాలీవుడ్ లో పలు సినిమాలు చేసింది. దబాంగ్, సన్నాఫ్ సర్దార్, దంబాగ్  2 (Dabang), లూటేరా, ఆర్ రాజ్ కుమార్ వంటి సూపర్ హిట్ సినిమాలతో స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కళంక్,  మిషన్ మంగళ్, దబాంగ్ త్రీ చిత్రాలతో అలరించింది. ఇక ఇటీవలే హీరా మండి, కకుడాతో డిజిటల్ తెరపై తన సత్తా చూపింది. ఇక గతేడాది ఈ భామ తన బాయ్ ఫ్రెండ్ జహీర్ ను పెళ్లాడింది.

మార్చి 8న సెట్ లోకి

పెళ్లి తర్వాత కూడా సోనాక్షి తన కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన వద్దకు టాలీవుడ్ ఆఫర్ రాగా జాన్వీ, కియారాలాగా తను కూడా టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే జటాధర సినిమా కోసం దర్శకుడు వెంకట్ కళ్యాణ్ (Venkat Kalyan) సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మార్చి 8వ తేదీ నుంచి ఈ భామ జటాధర సెట్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. మరి దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *